మహిళ నోట్లో బట్టలు కుక్కి రేప్ చేసిన పొలిటీషియన్, పోలీసులకు చెబితే బిడ్డలను చంపేస్తా !
ఇంటిలో ఒంటరిగా ఉన్న వివాహిత మహిళ మీద ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడు, గ్రామ పంచాయితీ సభ్యుడు అత్యాచారంచేసి పరారైన ఘటన కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి పోలీస్ స్టేషన్.
బెంగళూరు: ఇంటిలో ఒంటరిగా ఉన్న వివాహిత మహిళ మీద ప్రముఖ రాజకీయ పార్టీ నాయకుడు, గ్రామ పంచాయితీ సభ్యుడు అత్యాచారంచేసి పరారైన ఘటన కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తిమ్మంపల్లి గ్రామపంచాయితీ సభ్యుడు కృష్ణప్ప అనే కామాంధుడు మహిళ మీద అత్యాచారం చేశాడని గురువారం పోలీసులు చెప్పారు. తిమ్మంపల్లిలో ఓ మహిళ భర్త, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది. బుధవారం పిల్లలు స్కూల్ కు వెళ్లారు.

ఆమె భర్త పని మీద పొరుగు గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో మహిళ ఇంటిలో ఒంటరిగా ఉంది. మహిళ మాత్రమే ఒంటరిగా ఉందని తెలుసుకున్న కృష్ణప్ప ఇంటిలో చొరబడి ఆమె నోట్లో బట్టలు కుక్కి అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే నీ బిడ్డలను చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు.
రాత్రి భర్త ఇంటికి రావడంతో ఆమె జరిగిన విషయం చెప్పింది. భర్తతో కలిసి బాధితురాలు ఫిర్యాదు చేశారని, ఆమెను వైద్య పరిక్షలకు తరలించామని, పరారైన కామాంధుడు కృష్ణప్ప కోసం గాలిస్తున్నామని గురువారం బాగేపల్లి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications