తండ్రి సాయంతో నానమ్మ మర్డర్.. ఎలక్ట్రిక్ కట్టర్ తో ముక్కలుగా: ఒళ్ళు గగుర్పొడిచే క్రైం!!

సినిమాలు చూస్తున్న చాలామంది మంచి కంటే చెడు ఎక్కువగా నేర్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న అనేక హత్యలు సినిమాల ప్రభావంతోనే జరుగుతున్నాయని అనేక కేసులు స్పష్టం చేస్తున్నాయి. ఇక తాజాగా పూణేలో అటువంటి భయానక ఘటన ఒళ్ళు గగుర్పొడిచేలా చేసింది.

పూణేలో ఓ తండ్రీకుమారుల దారుణం

పూణేలో ఓ తండ్రీకుమారుల దారుణం

ఓ తండ్రి కుమారులు కలిసి చేసిన ఈ దారుణం వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని పూణేలో కేశవ నగర్లో నివాసం ఉండే 64 సంవత్సరాల ఉషా విట్టల్ గైక్వాడ్ దేహు రోడ్ లోని ఆర్మీ క్యాంపులో పనిచేసి పదవీ విరమణ పొందారు . ఆ తర్వాత ఆమె కేశవ నగర్ లో స్థిరపడ్డారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు సందీప్ గైక్వాడ్, కోడలు, మనవడు సాహిల్ గైక్వాడ్ ఉంటున్నారు. అత్తా కోడళ్ళ మధ్య తరచు గొడవలు జరుగుతూ ఉండడంతో సందీప్ గైక్వాడ్ భార్య ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.

నానమ్మను చంపాలని ప్లాన్, బాత్రూం లోకి లాక్కెళ్ళి గొంతు నులిమి చంపిన మనవడు

నానమ్మను చంపాలని ప్లాన్, బాత్రూం లోకి లాక్కెళ్ళి గొంతు నులిమి చంపిన మనవడు


ఇక తన తల్లి వెళ్లిపోవడానికి నాయనమ్మ కారణమని భావించి, ఆమెను హతమారిస్తే తమకు ఎలాంటి సమస్యలు ఉండబోవని, ఆస్తంతా తమ చేతుల్లో ఉంటుందని భావించిన మనవడు సాహిల్ గైక్వాడ్ తండ్రితో కలిసి ఆమెను చంపడానికి ప్లాన్ చేశాడు. మధ్యాహ్న సమయంలో ఉషా విట్టల్ గైక్వాడ్ నిద్రపోతుండగా మనవడు సాహిల్ గైక్వాడ్ ఆమెను బాత్రూంలోకి లాక్కెళ్లి గొంతు నులిమి హతమార్చాడు.

 ఎలెక్ట్రిక్ కట్టర్ తో డెడ్ బాడీ ముక్కలుగా.. ముధా నదిలో పారేసిన నిందితులు

ఎలెక్ట్రిక్ కట్టర్ తో డెడ్ బాడీ ముక్కలుగా.. ముధా నదిలో పారేసిన నిందితులు

ఆ తరువాత ఆమె మృతదేహాన్ని మాయం చేయాలని భావించిన కొడుకు, మనవడు అత్యంత క్రూరమైన పనికి దిగారు. చెట్లను నరికే ఎలక్ట్రిక్ కట్టర్ తో వృద్ధురాలి మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా కత్తిరించి, మృతురాలి శరీర భాగాలను అనేక బ్యాగ్ లలో నింపారు. ఆపై ఆ బ్యాగులను కార్లో తీసుకువెళ్లి ముధా నదిలో పడేశారు. పక్కనే ఉన్న చెత్త డిపోలో మరో బ్యాగ్ ను వదిలేశారు. ఆపై రక్తంతో తడిసిన కత్తిని, దుస్తులను నది ఒడ్డున పడేశారు. ఆ తర్వాత తమకు ఏమీ తెలియదు అన్నట్టు ఉషా విట్టల్ గైక్వాడ్ కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.

మిస్సింగ్ కేసు దర్యాప్తులో అనుమానం వచ్చిన పోలీసుల విచారణ.. దారుణం వెలుగులోకి

మిస్సింగ్ కేసు దర్యాప్తులో అనుమానం వచ్చిన పోలీసుల విచారణ.. దారుణం వెలుగులోకి

ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మృతురాలి కుమార్తె, తల్లి మిస్సింగ్ తర్వాత తన సోదరుడి ప్రవర్తనలో తేడా రావడంతో అనుమానంతో పోలీసులకు ఈ విషయాన్ని చెప్పింది. ఇక ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, అసలు విషయం బయటకు రావడంతో ఖంగు తిన్నారు. వృద్ధురాలి కుమారుడు, మనవడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. పోలీసుల విచారణలో మనవడు సాహిల్ గైక్వాడ్ నాయనమ్మ ఆస్తి కోసమే ఈ పని చేసామని, ఓ సినిమా ప్రభావంతో ఇలా హత్యకు ప్లాన్ చేశామని చెప్పడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+