పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సూపర్ సీఎం !
బెంగళూరు: కర్ణాటకలో 10వ తరగతి విద్యార్థులు ( ఎస్ఎస్ఎల్ సి- 2022-23) సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 నుండి ప్రారంభం కానున్నాయి. ఎస్ఎస్ఎల్ సీ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్ టీసీ, బీఎంటీసీ) బస్సుల్లో ఉచిత ప్రయాణం చెయ్యడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఎస్‌ఎల్‌సి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కెఎస్‌ఆర్‌టిసీ, బీఎమ్‌టీసీ బస్సులలో పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చెయ్యడానికి ప్రభుత్వం, అధికారులు అవకాశం ఇచ్చారు.
ఎస్‌ఎస్‌ఎల్‌సి సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కెఎస్‌ఆర్‌టిసి)లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. మరియు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్సులు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ సప్లిమెంటరీ పరీక్షకు వెళ్లే విద్యార్థుల కోసం రవాణా బస్సులను ఆపాలని సిబ్బందిని ఆదేశించారు.

ప్రధానంగా పరీక్ష రోజులలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరికి రవాణా శాఖ ప్రకారం వారి ఇంటి నుండి నిర్దేశిత పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. విద్యార్థులు తమ ఎస్‌ఎస్‌ఎల్‌సి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టిక్కెట్ ను బస్సుల్లో చూపించాలి. పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు, పరీక్షలు రాసిన తరువాత తిరిగి ఇంటికి వచ్చేటపుడు తమ ఎస్‌ఎస్‌ఎల్‌సి సప్లిమెంటరీ ఎగ్జామ్ హాల్ టిక్కెట్లు కండెక్టర్లకు చూపించాలని అధికారులు తెలిపారు.

పరీక్షల హాల్ టిక్కెట్ అడ్మిట్ కార్డ్‌ను చూపించడం ద్వారా రవాణా సంస్థ బీఎంటీసీ, కేఎస్ఆర్ టీసీకి చెందిన సిటీ, సబర్బన్, రెగ్యులర్ మరియు ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 12వ తేదీ నుంచి జూన్ 19వ తేదీ వరకు బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోన అన్ని జిల్లాల్లో ఎస్ఎస్ ఎల్ సి (10వ తరగతి) సంప్లమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications