బెంగళూరు మెట్రో అట్టర్ ప్లాఫ్.. ? ఇక్కడ బతకలేం బాబోయ్..!
దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో బెంగళూరు ఒకటి. బెంగళూరులో రోజురోజుకూ పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్తగా యెల్లో మెట్రో లైన్ సేవలను ప్రారంభించారు. ఈ మెట్రో మార్గం ఆర్‌వీ రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు 16 స్టేషన్లను కలుపుతుంది. ఈ కొత్త యెల్లో లైన్ తో, నమ్మ మెట్రో మొత్తం ఆపరేషనల్ పొడవు 96 కిలోమీటర్లకు చేరుకుంది. దీంతో దిల్లీ తర్వాత రెండో అతిపెద్ద మెట్రోగా బెంగుళూరు మెట్రో నిలిచింది. ఇది ఇన్ఫోసిస్, విప్రో, బయోకాన్, టెక్ మహీంద్రా వంటి ప్రధాన టెక్ హబ్ లకు కనెక్టివిటీని అందిస్తుంది. అయితే ఈ యెల్లో లైన్ నగరంలోని ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తుందని భావించారు. కానీ బెంగళూరు ట్రాఫిక్ మాత్రం తగ్గలేదని స్పష్టం అవుతోంది.
అయితే యెల్లో లైన్ వల్ల హోసూర్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని నగరవాసులు, అధికారులు భావించారు. కానీ లేటెస్ట్ రిపోర్టు ప్రకారం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. యెల్లో లైన్ వచ్చినా ఇంకా గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఉద్యోగులు, విద్యార్థులు చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో హూసూర్ రోడ్డు ఒకటి. అయితే మెట్రో సేవలు ప్రారంభం అయినా ఈ రద్దీ మాత్రం తగ్గడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అందించిన డేటా ప్రకారం.. బీటీఎమ్ లే అవుట్ నుంచి ఎలక్ట్రానిక్స్ సిటీ వరకు 12 కి. మీ ఉంటుంది. ఈ రోడ్డు యెల్లో మెట్రో లైన్ కు సమాంతరంగా నడుస్తుంది. అయితే ఈ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ ఏమాత్రం తగ్గలేదని నివేదిక చెబుతోంది. బెంగళూరు నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు బస్సులు, లోకల్ స్టేట్ బస్సులు, ఇతర వాహనాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే రహదారులతో హోసూర్ రోడ్డు 60 కి. మీ మేర రద్దీ నెలకొని ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

జులై నెలలో యెల్లో మెట్రో లైను ప్రారంభం కాకముందు ఈ ప్రాంతంలో రోజుకు 65.2 కి. మీ. మేర రద్దీ నెలకొని ఉండగా మెట్రో వచ్చాక ఆగస్టు 11 నుంచి సెప్టెంబర్ 11 మధ్యలో రద్దీ 61.7 కి. మీ. గా ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అంటే మెట్రో సర్వీసు వచ్చాక రద్దీ కేవలం కి.మీ మేర మాత్రమే తగ్గినట్లు పేర్కొన్నారు.
ఇక ఇప్పటికే యెల్లో లైన్ లో ప్రయాణికుల సంఖ్య 10 లక్షలు దాటినట్లు మెట్రో తెలిపింది. అయితే యెల్లో లైన్ లో పలు సమస్యలు ఉన్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఒక్కో ట్రైన్ మధ్య గ్యాప్ 19 నిమిషాలు ఉండటంతో సమయం వృథా అవుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications