అనూహ్యం: యోగి నిర్ణయంతో ఓ పెళ్లిలో ఊహించని ఘటన!..

Subscribe to Oneindia Telugu

లక్నో: ఎంత ప్లానింగ్‌గా పని కానిద్దామనుకున్నా.. ఒక్కోసారి అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి నెలకొంటుంది. పెళ్లిళ్ల వంటి కార్యక్రమాలైతే.. చాలాసార్లు భోజనాల దగ్గరే సమస్యలు రావడం కామన్. ముందుగా చెప్పిన దానికంటే ఎక్కువ మంది వేడుకకు హాజరుకావడమో.. లేక రుచికరంగా వంటలు వండకపోవడమో... మొత్తానికి ఏర్పాట్ల విషయంలో మాటా మాట పెరిగి ఘర్షణకు దారితీసిన సందర్భాలు అనేకం.

ఇక ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల మరో కొత్త సమస్య తయారైనట్లుగానే కనిపిస్తోంది. కబేళాలను మూసివేస్తూ అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం ఓ వివాహ వేడుకపై పరోక్షంగా ప్రభావం చూపించింది. ఏకంగా వరుడి స్థానంలో మరో అతిథిని వధువు వివాహామాడాల్సిన పరిస్థితిని కల్పించింది.

అసలు విషయమేంటంటే!..ఉత్తరప్రదేశ్‌ లోని కుల్హేదీ గ్రామంలో బుధవారం నాడు ఓ జంటకు వివాహం జరగాల్సి ఉంది. అనుకున్న ప్రకారం అంతా సిద్దమైపోయింది. మరికొద్దిసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. మాంసాహారం వండలేదన్న కారణంతో.. వరుడు వధువు కుటుంబంతో పేచీకి దిగాడు.

Groom calls off wedding after pure vegetarian menu, guest proposes to bride

సీఎం యోగి కబేళాలను మూసివేయించడంతో.. ఎంత ప్రయత్నించినా మాంసం దొరకలేదని, అందువల్లే మాంసాహారం వండలేకపోయామని వధువు కుటుంబం నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా వరుడి తరుపువారు శాంతించలేదు సరికదా, అంతకంతకూ ఘర్షణను పెంచే ప్రయత్నం చేశారు.

వరుడి కుటుంబం వ్యవహరించిన తీరు వధువుకు తీవ్ర అసహనం కలిగేలా చేసింది. కేవలం తిండి కోసం ఇంత రచ్చ చేసే వరుడు తనకు వద్దంటే వద్దని తేల్చేసింది. దీంతో వివాహా వేడుకకు హాజరైన ఓ అతిథి.. వధువు ధైర్యం తనకు నచ్చిందని, తాను వివాహం చేసుకుంటానని చెప్పాడు.

అందుకు వధువు కూడా అంగీకరించడంతో.. అదే ముహూర్తానికి సదరు అతిథి వివాహ కార్యక్రమం పూర్తయిపోయింది. ఊహించని పరిణామానికి వరుడి కుటుంబం అవమానభారంతో వెనుదిరగక తప్పలేదు.

ఇదిలా ఉంటే, ఉత్తరప్రదేశ్ లో కబేళాలను మూసివేయడం ద్వారా మాంసం ధరలు చుక్కలు చూస్తున్నాయి. చాలా తక్కువ మొత్తంలో మాత్రమే మాంసం దొరుకుతుండటంతో డిమాండ్ అధికంగా ఉంది. కేజీ చికెన్ ను రూ.260కి విక్రమిస్తున్నారంటే ధరలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందు రూ.350-400గా కేజీ మటన్ ధర ఇప్పుడు రూ.600కు చేరడం గమనార్హం. ఇక గేదె మాంసం రూ.150చొప్పున విక్రయిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The ban on illegal slaughterhouses across Uttar Pradesh took a toll on a wedding in Muzaffarnagar when the groom refused to solemnise his marriage after seeing that only vegetarian dishes were being served by the bride’s family.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి