జిఎస్టీ ఎఫెక్ట్: ఆ కారు ధర రూ.3 లక్షలు తగ్గింపు, వీటిపైనా..
వస్తు, సేవల పన్ను (జిఎస్టీ) ప్రభావంతో కొన్నింటి ధరలు పెరుగుతుండగా, మరికొన్నింటి ధరలు తగ్గుతున్నాయి. అయితే, ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా కార్ల ధరలను భారీగా తగ్గించింది.
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జిఎస్టీ) ప్రభావంతో కొన్నింటి ధరలు పెరుగుతుండగా, మరికొన్నింటి ధరలు తగ్గుతున్నాయి. అయితే, ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా కార్ల ధరలను భారీగా తగ్గించింది.
జిఎస్టీ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఆ ప్రయోజనాల్ని కొనుగోలుదారులకు బదిలీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తన వాహన శ్రేణిలోని వివిధ కార్లపై 4.5శాతం వరకూ ధరలను తగ్గించింది.

తగ్గించిన ధరల్లో రాష్ట్రాల రాష్ట్రాలకు మధ్య అంతరం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ కార్ల ధరలు ముంబైలో బాగా తగ్గనున్నాయి.
ఫోర్డ్ ఉత్పత్తి చేస్తున్న ఎస్‌యూవీ ఎండీవర్ ధర ముంబైలో దాదాపు రూ.3లక్షల వరకూ తగ్గనుంది.
ఇక ఫిగో నుంచి ఎండీవర్‌కు వరకూ ఉన్న వివిధ శ్రేణి కార్లపై దాదాపు రూ.28వేల నుంచి 3లక్షల వరకు తగ్గనుంది. ఢిల్లీలో ఫిగోపై రూ.2వేల వరకూ తగ్గింపు,ఎకోస్పోర్ట్స్‌పై దాదాపు రూ.8వేలు తగ్గనుంది.
ఇక ఎండీవర్ ధర ఢిల్లీలో సుమారు లక్షన్నర రూపాయల వరకు తగ్గనుంది.ఫిగో మొదలుకుని ఎండీవర్ వంటి అధిక ధరల కార్లను ఫోర్డ్ ఇండియా మన దేశంలో విక్రయిస్తోంది.
వీటి ధరలు రూ.4.75 నుంచి రూ.31.5లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి. జీఎస్టీ ప్రభావంతో మిగిలిన కార్ల సంస్థలు కూడా ఆ మేరకు కార్ల ధరలు తగ్గించాయి.












Click it and Unblock the Notifications