Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవం: అందరి విజయమన్న మోడీ, అన్నాడీఎంకే వాకౌట్

న్యూఢిల్లీ: లోక్‌సభలో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయా పార్టీలకు ప్రధాని నరేంద్రమోడీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో అడ్డంకులను దాటుకొని రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందిన జీఎస్‌టీ బిల్లును సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే.

బిల్లుపై చ‌ర్చ అనంత‌రం ఓటింగ్ జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ పన్నుల సంస్కరణలకు తెరలేపనున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు లోక్‌సభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. లోక్‌సభలో మొత్తం 429 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.

వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్టు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును ఇటీవలే రాజ్యసభ కూడా ఆమోదించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా జీఎస్టీ బిల్లును భావిస్తున్నారు.

జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవం: అందరి విజయమన్న మోడీ, అన్నాడీఎంకే వాకౌట్

జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవం: అందరి విజయమన్న మోడీ, అన్నాడీఎంకే వాకౌట్

సోమవారం లోక్‌సభలో జీఎస్‌టీ బిల్లు ప్రధాని మోడీ మాట్లాడుతూ ‘జీఎస్‌టీ సవరణల బిల్లులో విజయం ఏ ఒక్క పార్టీదో కాదు.. ఈ విజయం అందరిదీ' అన్నారు. జీఎస్‌టీ బిల్లు విజయాన్ని ప్రజాస్వామ్య విజయమంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. లోక్‌సభలో జీఎస్టీ బిల్లుకు అన్ని పక్షాలు మద్దతు ఇచ్చాయని ఆయన తెలిపారు.

జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవం: అందరి విజయమన్న మోడీ, అన్నాడీఎంకే వాకౌట్

జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవం: అందరి విజయమన్న మోడీ, అన్నాడీఎంకే వాకౌట్

జీఎస్‌టీ బిల్లు అమలైతే పన్నుల ఉగ్రవాదం నుంచి దేశం బయటపడిందని ప్రధాని మోడీ చెప్పారు. ఒకే దేశం - ఒకే పన్ను విధానం అని అన్నారు. జీఎస్‌టీ బిల్లు వల్ల అంతిమంగా వినియోగదారుడికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర నమ్మకంతో పనిచేయాలని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవం: అందరి విజయమన్న మోడీ, అన్నాడీఎంకే వాకౌట్

జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవం: అందరి విజయమన్న మోడీ, అన్నాడీఎంకే వాకౌట్

జాతి ప్రయోజనాలే తనకు ముఖ్యమని, రాజకీయ ప్రయోజనాలు కాదని అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం తనకు సమస్యలను ఎదుర్కోవడంలో కలిసి వస్తోందని చెప్పారు. జీఎస్‌టీ అమలు విషయంలో ముఖ్యమంత్రుల సమస్యలు ఎలా వుంటాయో తనకు తెలుని అన్నారు. జీఎస్‌టీ బిల్లుపై అనేక సంప్రదింపులు జరిపామని.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతోనూ చర్చించామనీ ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

 జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవం: అందరి విజయమన్న మోడీ, అన్నాడీఎంకే వాకౌట్

జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవం: అందరి విజయమన్న మోడీ, అన్నాడీఎంకే వాకౌట్

అనంతరం జైట్లీ స‌భ‌లో స‌భ్యులు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. జీఎస్‌టీలో వివాదాల పరిష్కారానికి అవకాశం ఉందని లోక్‌సభలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీనికోసం కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. జీఎస్‌టీ బిల్లుకు రాజ్యసభ సలహాలు మాత్రమే ఇవ్వగలదని ఆయన తెలిపారు.

 జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవం: అందరి విజయమన్న మోడీ, అన్నాడీఎంకే వాకౌట్

జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవం: అందరి విజయమన్న మోడీ, అన్నాడీఎంకే వాకౌట్

అయితే, బిల్లుపై జైట్లీ ఇచ్చిన వివ‌ర‌ణ త‌మ‌ను సంతృప్తిప‌రచ‌లేదంటూ అన్నాడీఎంకే నాయ‌కుడు పి.వేణుగోపాల్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అనంత‌రం అన్నాడీఎంకే స‌భ్యులు స‌భ నుంచి వాకౌట్ చేశారు. ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంతో పాటు దేశంలోని 50శాతం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలిపితే.. ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించడంతోపాట దేశంలోని 50శాతం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలిపితే.. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+