జీఎస్టీ డెడ్ లైన్ జూలైకి వాయిదా: అరుణ్ జైట్లీ

కాగా, వార్షిక టర్నోవర్ రూ,1.5కోట్ల వరకు ఉన్న సంస్థల పన్నులపై తమకే పూర్తి హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్న సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ: ఏప్రిల్1 నుంచి కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకురావాలనుకున్న జీఎస్టీ అమలు తేదీ వాయిదా పడింది. జూలై1,2017కు జీఎస్టీ తేదీ వాయిదా పడింది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని ప్రకటించారు.

పన్ను అధికారాలపై కేంద్ర-రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించనందున్న ఈ తేదీని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. జీఎస్టీ అమలు తేదీపై అరుణ్ జైట్లీ అధ్యక్షతన నేడు సమావేశమైన కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. కౌన్సిల్ తర్వాతి సమావేశం ఫిబ్రవరి 18న జరగనుంది.

Gst roll out deferred to july 1 finance minister arun jaitley

కాగా, వార్షిక టర్నోవర్ రూ,1.5కోట్ల వరకు ఉన్న సంస్థల పన్నులపై తమకే పూర్తి హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం కేంద్రం సానుకూలంగా లేనప్పటికీ.. ఆఖరికి 90శాతం హక్కులు రాష్ట్రాలకు, 10శాతం కేంద్రం పరిధిలో ఉంటాయని జైట్లీ పేర్కొన్నారు.

రూ.1.5కోట్ల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులపై కేంద్రానికి-రాష్ట్రానికి 50:50హక్కులు కలిగి ఉండనున్నట్టు చెప్పారు. అయితే పశ్చిమబంగా లాంటి రాష్ట్రాలు జీఎస్టీ తమ రెవెన్యూకు గండిపెడుతోందని వాదిస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో కేంద్రం చెల్లించే నష్టపరిహారాలను పెంచాలని ఆ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+