అయోధ్యలో మహా ఘట్టం.. 26 లక్షల దీపాలతో గిన్నీస్‌ రికార్డు !

భారత దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటేలా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే రామనగరంగా పేరుగాంచిన పవిత్ర అయోధ్యలో దీపోత్సవం వేడుక చరిత్ర సృష్టించింది. ఈ కార్యక్రమంలో రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. దీంతో ఈ వ్యవహారం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుండగా.. చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభం..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకలకు ప్రధాన ఆతిథ్యులుగా హాజరయ్యారు. రామమందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. ఆయన రామ్ కీ పైడీ ఘాట్ వద్ద హారతి ఇచ్చారు. అనంతరం రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు వేషధారణలోని కళాకారులు ఉన్న రథాన్ని స్వయంగా లాగి తొలి దీపం వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది దీపోత్సవం రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పింది.

guinness-world-records-registered-in-deepotsavam-ceremony-at-ayodhya

ఈ రెండు ఘనతలకు సంబంధించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్‌లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వీకరించారు.

  • మొదటిది - 26,70,215 దీపాలు ఒకేసారి వెలిగించడం
  • రెండవది - సరయూ నదీ తల్లికి 2128 మంది పూజారులు ఏకకాలంలో మహా ఆరతి నిర్వహించడం.

కాగా సరయూ నదీ తీరంలోని ఘాట్‌లు దీప కాంతులతో మెరిసిపోయాయి. ప్రభుత్వం ముందుగా ఏర్పాట్లు చేసిన ప్రకారం.. 26,70,215 దీపాలు ఒకేసారి వెలిగించడంతో మొత్తం నగరం వెలుగుల హారంగా మారింది. నదిపై ప్రతిబింబించిన ఆ దీపాల కాంతి ఆకాశంలోని నక్షత్రాలను భూమికి తీసుకొచ్చినట్లుగా కనిపించింది. ఘాట్‌లన్నీ భక్తులతో నిండిపోగా.. "జై శ్రీరామ్" నినాదాలు మారుమోగాయి. అలానే దీపోత్సవం సందర్భంగా జరిగిన రామలీలా ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు, లేజర్ షోలు, ఫైర్‌వర్క్స్ భక్తులను, పర్యాటకులను ఆకట్టుకున్నాయి. లేజర్ షో సైతం ఆకాశాన్నే రంగుల కాంతులతో నింపింది.

2017 నుంచి కొనసాగుతున్న దీపోత్సవం..

దీపోత్సవం కార్యక్రమాన్ని మొదటిసారిగా 2017లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. అప్పట్లో కేవలం 1.71 లక్షల దీపాలు వెలిగించగా, ఈ తొమ్మిదో ఎడిషన్‌లో ఆ సంఖ్య 2.6 మిలియన్లు దాటింది. దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ వేడుకను ప్రత్యక్షంగా చూడటానికి అయోధ్యకు తరలివచ్చారు. మరోవైపు లక్షలాది భక్తులు, పర్యాటకులు హాజరైన నేపథ్యంలో, అయోధ్య నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 10,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. డ్రోన్లు, సీసీటీవీలతో పర్యవేక్షణ కొనసాగింది.

ఇక ఈసారి దీపోత్సవం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రత్యేకత సంతరించుకుంది. మట్టి దీపాలను స్థానిక కళాకారులచే తయారు చేయించడంతో పాటు.. వాడిన నూనెను జైవ ఉత్పత్తులుగా పునర్వినియోగం చేసే ఏర్పాట్లు చేశారు. దీపాల తయారీలో గ్రీన్ మిషన్ సహకారం కూడా ఉందని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+