షాక్.. ఎన్నికల్లో పోటీ చేయడంలేదని తేల్చేసిన మాజీ సీఎం..!

గుజరాత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఆ రాష్ట్రంలో హీట్ పుట్టిస్తోంది. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తుండగా... కాంగ్రెస్ మాత్రం ఆ రాష్ట్రంలో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి కూడా వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా మరో షాక్ బీజేపీకి తగిలింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడంలేదంటూ సంచలన ప్రకటన చేశారు. గుజరాత్ రాష్ట్రానికి విజయ్ రూపాణీ 16వ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. 2016 నుంచి 2021 వరకు రెండు దఫాలుగా సేవలందించారు.ఈయన రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గంకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

2021 సెప్టెంబర్ 12వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రూపాణీ రాజీనామా చేశాడు. అయితే ఆయన రాజీనామాకు కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ... పార్టీలో విభేధాలు తలెత్తడంతోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందనే వార్తలు వినిపించాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రూపాణీ.. తను రాజీనామా చేయాల్సిందిగా హైకమాండ్ కోరడంతో శిరసావహించి తప్పుకున్నట్లు వెల్లడించారు. గుజరాత్ ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించాడు.

Gujarat Assembly elections 2022: Former CM Vijay Rupani decides not to contest the elections

కొత్త నాయకులు పుడుతూనే ఉంటారు. వారికి కూడా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే తాను తప్పుకుంటున్నట్లు నాడు విజయ్ రూపాణీ చెప్పుకొచ్చాడు. ముందుగా కేశూభాయ్ సీఎంగా ఉన్నారని ఆ తర్వాత ఆయన తప్పుకుని నరేంద్ర మోదీకి అవకాశం ఇచ్చారని ఆ తర్వాత మోదీ ప్రధానిగా ప్రమోట్ కాగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్‌కు ఛాన్స్ వచ్చిందని గుర్తు చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయమన్నప్పుడు చాలా సంతోషంగా చేసినట్లు గుర్తు చేశారు విజయ్ రూపాణీ. బీజేపీ కార్యకర్తలు అధికారం కోసం పనిచేయరని చెప్పిన రూపాణీ... పార్టీ కోసం కష్టపడతామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సీఎం భూపేంద్ర పటేల్ ముందుండి ఈ గుజరాత్ ఎన్నికల్లో పార్టీని నడిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+