తొలి పరీక్ష: గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి తగ్గుతోన్న సీట్ల సంఖ్య - వివరాలివే..!!

అహ్మదాబాద్: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు ఆరంభం కానుంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. 5వ తేదీన మలి విడత పోలింగ్‌ జరుగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే పోలింగ్‌ను ముగించుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ఓట్లను లెక్కిస్తారు. గుజరాత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం, ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనత పార్టీ అధికారంలో ఉండటం వల్ల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంటోంది.

రెండు కోట్లకు పైగా..

రెండు కోట్లకు పైగా..

గుజరాత్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 182. వాటికి కేంద్ర ఎన్నికల సంఘం రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనుంది. తొలి విడతలో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. దక్షిణ గుజరాత్‌, కఛ్, సౌరాష్ట్ర రీజియన్లలోని జిల్లాలు ఇందులో ఉన్నాయి. మిగిలిన 93 స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ ఉంటుంది. తొలి విడతలో మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,24,33,362 మంది పురుషులు, 1,1,5,42,811 మంది మహిళలు, 497 మంది థర్డ్ జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

89 స్థానాల్లో..788 మంది..


తొలి దశ 89 స్థానాల్లో 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 718 మంది పురుషులు, 70 మంది మహిళా అభ్యర్థులు. మొత్తం 89 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పోటీ చేస్తోన్నాయి. తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో పోటీకి దిగింది. సూరత్ తూర్పు నియోజకవర్గానికి నామినేషన్‌ను దాఖలు చేసిన ఆప్ అభ్యర్థి దాన్ని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. దీనితో 88 సీటు తగ్గిందా పార్టీకి.

ముఖ్యమంత్రి సహా..

ముఖ్యమంత్రి సహా..

తొలి దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న అభ్యర్థుల జాబితా పెద్దదే. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పోటీలో ఉన్న ఘట్లోడియా స్థానానికీ ఇవ్వాళే పోలింగ్ జరుగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గఢ్వీ పోటీలో ఉన్న ఖంభాలియా, బీజేపీ తరఫున హార్దిక్ పటేల్ పోటీ చేసిన వీరంగామ్ నియోజకవర్గాలు తొలి విడత జాబితాలోనే ఉన్నాయి. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా పోటీలో ఉన్న జామ్‌నగర్ నార్త్, ఆప్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా భవితవ్యం తేలేది తొలిదశలోనే.

బరిలో బీఎస్పీ..

బరిలో బీఎస్పీ..


ఈ ఎన్నికల బరిలో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్‌వాది పార్టీ పోటీ చేస్తోంది. 57 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపింది. భారతీయ ట్రైబల్ పార్టీ-14, సీపీఎం-4 అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 339 మంది స్వతంత్ర అభ్యర్థులు తొలి విడత రేసులో నిలిచారు. వారి భవితవ్యం ఏమిటనేది ఈ నెల 8వ తేదీన తేలిపోతుంది.

మెజారిటీ తగ్గుతోంది..

మెజారిటీ తగ్గుతోంది..


గుజరాత్‌- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం వల్ల ఈ ఎన్నికలపై అందరి దృష్టి నిలిచింది. పైగా నాలుగు దఫాలుగా ఈ పార్టీనే అధికారంలో ఉంటూ వస్తోంది. ఇప్పుడు కూడా గెలిస్తే వరుసగా అయిదోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినట్టవుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించింది. 2002లో 127, 2007లో 117, 2012లో 115, 2017లో 99 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది బీజేపీ. క్రమంగా సీట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+