Gujarat Assembly elections:ముగిసిన పోలింగ్.. గెలుపు ఎవరిని వరిస్తుంది..?

గుజరాత్ రెండవ దశ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 93 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈ 93 స్థానాలు 14 జిల్లాల్లో ఉన్నాయి. ఇక రెండవ దశలో అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు కీలకంగా ఉన్నాయి. రెండో దశలో కూడా పోరు మక్కోణపు పోటీగా జరిగిందనే వార్తలు వస్తున్నాయి.. బీజేపీ కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు ఈసారి సైఅంటోంది కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ

డిసెంబర్ 5న ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది రెండవ దశలో మొత్తం 2.54 కోట్ల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక రెండవ దశ ఓటింగ్‌కు సంబంధించి మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Gujarat Assembly elections 2022 live updates in telugu.

Dec 05, 2022, 6:01 pm IST

సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
Dec 05, 2022, 6:00 pm IST

డిసెంబర్ 8న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
Dec 05, 2022, 6:00 pm IST

గాంధీనగర్, అహ్మదాబాద్, వడోదరలో పోలింగ్ ముగియడంతో ఈవీఎం,వీవీప్యాట్‌లను సీల్ చేసి భద్రపరుస్తున్న అధికారులు
Dec 05, 2022, 5:59 pm IST

గుజరాత్‌లో ముగిసిన పోలింగ్.సాయంత్రం 5 గంటల సమయానికి 58.68శాతం పోలింగ్ నమోదు
Dec 05, 2022, 4:28 pm IST

పోలింగ్ ముగిసేందుకు మరో అరగంట మాత్రమే ఉంది. 5 గంటల్లోపు క్యూలైన్లలో నిల్చున్న వారికే ఓటు వేసే అవకాశం
Dec 05, 2022, 4:01 pm IST

మధ్యాహ్నం 3 గంటల సమయానికి గుజరాత్ రెండో దశ పోలింగ్ 50.51శాతం
Dec 05, 2022, 3:51 pm IST

ప్రతి ఒక్కరూ ఓటువేసేందుకు తరలిరావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను: యూసఫ్ పఠాన్
Dec 05, 2022, 3:43 pm IST

"ఓటు అనేది మన హక్కు బాధ్యత. ఇప్పటి వరకు 60శాతం పోలింగ్ నమోదైందని విన్నాను. పోలింగ్ శాతాన్ని ఇంకా పెంచాలని కోరుతున్నాను. మనదేశం భవిష్యత్తులో సూపర్ పవర్‌గా ఎదుగుతుంది." - ఇర్ఫాన్ పఠాన్
Dec 05, 2022, 3:40 pm IST

ఖేడాలో ఓటు హక్కు వినియోగించుకున్న దివ్యాంగుడు. "20 ఏళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాను. కానీ నేను నిరత్సాహపడలేదు. కాళ్లతో ఓటు వేశాను"-అంకిత్ సోనీ
Dec 05, 2022, 2:22 pm IST

ఓటింగ్ రోజున రోడ్‌షోకు అనుమతి లేదు. కానీ ప్రధాని మోదీ ఆయన పార్టీ కార్యకర్తలు వీవీఐపీలు కాబట్టే వారేమి చేసినా చెల్లుతుంది.:బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Dec 05, 2022, 1:49 pm IST

ఆమ్‌ఆద్మీపార్టీ గుజరాత్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాద్వీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు
Dec 05, 2022, 1:29 pm IST

మెయిన్‌పురి

మెయిన్‌పురి ఉపఎన్నికలో ఎస్పీ గెలుస్తుందన్న పూర్తి విశ్వాసం నాకుంది-డింపుల్ యాదవ్
Dec 05, 2022, 1:14 pm IST

వడోదరాలో ఓటు హక్కు వినియోగించుకున్న టీమిండియా మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా
Dec 05, 2022, 12:30 pm IST
గుజరాత్

దేశం కోసం మోదీ చాలా పనిచేస్తున్నారు. ఆయన చేసిన పనిని ఎవరూ మరిచిపోలేరు. అప్పుడప్పుడు విశ్రాంతి కూడా తీసుకోవాలి: మోదీ సోదరుడు సోమాభాయ్ మోదీ
Dec 05, 2022, 12:26 pm IST
గుజరాత్

గాంధీనగర్ రైసన్ ప్రైమరీ స్కూల్‌లో ఓటు వేసిన ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ. ఓటు వేయడానికి ఆమె వీల్‌చైర్‌పై వచ్చారు.
Dec 05, 2022, 12:23 pm IST
గుజరాత్

గుజరాత్‌లో మధ్యాహ్నం తరువాత పోలింగ్ మరింత ఊపందుకుంటుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
Dec 05, 2022, 12:10 pm IST
గుజరాత్

మలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అహ్మదాబాద్ రణిప్ ఏరియాలో గల నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు సోమన్‌భాయ్ మోదీ.
Dec 05, 2022, 12:02 pm IST
ఉత్తర్ ప్రదేశ్

ఉదయం 11 గంటల వరకు మైన్‌పురి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో 18.72 శాతం ఓటింగ్ జరిగినట్లు వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం.
Dec 05, 2022, 11:52 am IST
గుజరాత్

ఉదయం 11 గంటల సమయానికి 19.17 శాతం ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించిన ఎన్నికల సంఘం అధికారులు.
Dec 05, 2022, 11:28 am IST
ఢిల్లీ

గుజరాత్‌లో రెండో విడతగా 93 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోరుగా సాగుతున్న పోలింగ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మాజీ సీఎం, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Dec 05, 2022, 11:18 am IST
రాజస్థాన్

సర్దాషహర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్న స్థానికులు.
Dec 05, 2022, 11:17 am IST
గుజరాత్

అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం స్థానిక ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.
Dec 05, 2022, 11:13 am IST
గుజరాత్

ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ప్రత్యేకించి- కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. యువతీ యువకులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలి- ఓటు వేసిన అనంతరం అమిత్ షా కామెంట్స్.
Dec 05, 2022, 11:02 am IST
గుజరాత్

అహ్మదాబాద్‌ నరన్‌పురలో గల సబ్-జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. తన కుమారుడు బీసీసీఐ కార్యదర్శి జై షా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు.
Dec 05, 2022, 10:53 am IST
ఉత్తర్ ప్రదేశ్

మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఇటావా సైఫాయ్‌లోని అభినవ్ విద్యాలయాలో తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.
Dec 05, 2022, 10:36 am IST
గుజరాత్

రెండోదశలో ఓబీసీ మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓబీసీని ప్రకటించడం వల్ల ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టబోతున్నారు. 27 ఏళ్ల బీజేపీ పాలనకు ముగింపు పడనుంది: మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలా
Dec 05, 2022, 10:28 am IST
గుజరాత్

వీరంగామ్ చంద్రానగర్ ప్రైమరీ స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్.
Dec 05, 2022, 10:25 am IST
గుజరాత్

అహ్మదాబాద్ శిలాజ్ అనుపమ్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన మాజీ ముఖ్యమంత్రి, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్.
Dec 05, 2022, 10:21 am IST
గుజరాత్

ఇది ప్రజాస్వామ్య పండుగ. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. గుజరాత్ ప్రజలు తెలివైనవారు, ఆలోచనాత్మకంగా ఓటు వేస్తారు- ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా
Dec 05, 2022, 10:12 am IST
గుజరాత్

ప్రజాస్వామ్య పండగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ (ఎంసీడీ ఎన్నికలు) ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. దేశ ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘానికి అభినందనలు- ఓటు వేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+