గుజరాత్ రెండో విడత: హార్దిక్ పాండ్యా సహా ఓటు వేసే వీఐపీలు వీరే..!!

అహ్మదాబాద్: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు పోలంగ్ ఆరంభం కానుంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. 1వ తేదీన తొలి విడత పోలింగ్‌ ముగిసింది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే పోలింగ్‌ను ముగించుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ఓట్లను లెక్కిస్తారు. గుజరాత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం, ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనత పార్టీ అధికారంలో ఉండటం వల్ల ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టీ నిలిచింది.

 రెండు కోట్లకు పైగా..

రెండు కోట్లకు పైగా..


గుజరాత్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 182. వాటికి కేంద్ర ఎన్నికల సంఘం రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది. తొలి విడతలో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్ ఇదివరకే ముగిసింది. దక్షిణ గుజరాత్‌, కఛ్, సౌరాష్ట్ర రీజియన్లలోని జిల్లాలు ఇందులో ఉన్నాయి. మిగిలిన 93 స్థానాలకు ఇవ్వాళ పోలింగ్ జరుగనుంది. సెంట్రల్, నార్త్ గుజరాత్‌లల్లో గల 14 జిల్లాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

93 స్థానాల్లో..788 మంది..

93 స్థానాల్లో..788 మంది..


రెండో దశలో పోలింగ్ జరుగనున్న 93 స్థానాల్లో మొత్తం 833 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 69 మంది మహిళల, 285 మంది స్వతంత్ర్య అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ అన్నీ స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలిపారు. కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన మూడింటిని తన మిత్రపక్షం- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది. బహుజన్ సమాజ్ పార్టీ-44, భారతీయ ట్రైబల్ పార్టీ-12 చోట్ల పోటీ చేస్తోంది. అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగనుంది.

26 వేలకు పైగా..

26 వేలకు పైగా..


మొత్తం 2.54 కోట్ల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారు. వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం 26,409 పోలింగ్ స్టేషన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 29,000 మంది ప్రిసైడింగ్ అధికారులను నియమించింది. అలాగే 84,000 మంది పోలింగ్ సిబ్బందిని రంగంలోకి దింపింది. సుమారు 36,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించనుంది ఈసీ.

ఓటు వేయనున్న ప్రముఖులు వీరే..

ఓటు వేయనున్న ప్రముఖులు వీరే..

రెండో విడత పోలింగ్ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఓటు వేయనున్నారు. అహ్మదాబాద్‌ రణిప్ ప్రాంతంలో గల నిషాన్ స్కూల్‌‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మోదీ ఈ ఉదయం 8:30 గంటలకు ఓటు వేస్తారు. ఆయన రాక సందర్భంగా నిషాన్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.

నరన్ పురాలో

నరన్ పురాలో

అహ్మదాబాద్‌లోని నరన్‌పురా కామేశ్వర్ ఆలయం వద్ద గల మున్సిపల్ సబ్ జోనల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓటు వేయనున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటారు. అహ్మదాబాద్‌లోని శిలాజ్ ప్రైమరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకుంటారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. ఘట్లోడియా నుంచి ఆయన పోటీలో ఉన్నారు.

హార్దిక్ పాండ్యా..

హార్దిక్ పాండ్యా..

టీమిండియా టీ20 ఫార్మట్ కేప్టెన్, గుజరాత్‌కే చెందిన హార్దిక్ పాండ్యా, ఆయన సోదరుడు క్రికెటర్ కృనాల్ పాండ్యా, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గఢ్వీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ థాకూర్, మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా, శక్తిసింహ్ గోహిల్ తదితరులు ఓటు వేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+