ఏడేళ్ళుగా సహజీవనం, ఏకాంతంగా గడిపిన వీడియోలు నెట్లో పెడతానని ఇలా...
సహజీవనం చేస్తుండగా తన పై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ బెంగుళూరు పోలీసులను ఆశ్రయించింది.
బెంగుళూరు:సహజీవనం చేస్తుండగా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక మహిళ శనివారం నాడు బెంగుళూరు సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.పెళ్ళి చేసుకోవాలని కోరితే తనతో గడిపిన వీడియోలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తున్నాడని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ మహిళ ఇక్కడే ఒక స్వచ్చంధ సంస్థలో పనిచేస్తున్నారు. గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్త ప్రదీప్ కుమార్ అభిరామ్ అనే వ్యక్తి బెంగుళూరులోనే ఉంటాడు. అతనితో 2010 నుండి పరిచయమని ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్టు తెలిపారు.

పెళ్లి చేసుకోమని అడిగితే ఏకాంతంగా గడిపిన వీడియోలు ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. కులం పేరుతోనూ దూషించాడని ఆవేదన వ్యక్తం చేసింది.
పలువురు మహిళలను బెదిరించి సంబంధాలను పెట్టుకొన్నాడని ఆరోపించారు. ప్రదీప్ కుమార్ పై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.పరారీలో ఉన్న అతడిని పట్టుకొనేందుకు పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications