ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్: రేఖాబెన్ చౌదరి రాజీనామా

అహ్మదాబాద్: శాసనసభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న తరుణంలో గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేఖాబెన్ చౌదరి పార్టీలోని అన్ని పదవులతోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

అయితే, ఆమె రాజీనామాకు గల కారణాలు ఇంకా వెల్లడిచేయలేదు. టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Gujarat Congress spokesperson resigns: Party in trouble ahead of Assembly elections?

డిసెంబర్ 9న మొదటి దశ, 14న రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రేఖాబెన్ రాజీనామా వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. అయితే, ఇటు బీజేపీలోనూ అసంతృప్తుల రాజీనామాలు కొనసాగుతున్నాయి.

మాజీ ఎంపీ కాంజీభాయ్ పటేల్, తన కుమారుడు సునీల్ పటేల్‌లు వారం క్రితమే బీజేపీకి రాజీనామా చేశారు. టికెట్ల కేటాయింపు వ్యవహారంలో తేడా రావడంతో తొలి విడత నామినేషన్ సమర్పణ గడువు రోజు వారు కమలం పార్టీ నుంచి వైదొలిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+