వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూను ఓ మహిళా శిశ్యురాలిపై అత్యాచారం కేసులో దోషిగా తేల్చింది గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ కోర్టు.

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూను ఓ మహిళా శిశ్యురాలిపై అత్యాచారం కేసులో దోషిగా తేల్చింది గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ కోర్టు. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో అరెస్టై ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు ఆశారాం.

దాదాపు దశాబ్దం క్రితం నాటి అత్యాచారం కేసులో గుజరాత్ కోర్టు తాజాగా ఆశారాంను దోషిగా తేల్చింది. 2013లో గుజరాత్ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో నివసిస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

 Gujarat court convicts self-styled godman Asaram Bapu in another rape case

ఈ కేసుపై విచారణ జరిపిన గాంధీనగర్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసులో ఆశారం బాపూను దోషిగా తేల్చింది. ఈ కేసులో మంగళవారం శిక్షను ఖరారు చేయనుంది.

సూరత్‌కు చెందిన ఒక మహిళ ఆశారాం బాపూతోపాటు మరో ఏడుగురిపై అత్యాచారం, అక్రమ నిర్బంధం కేసు పెట్టింది. వీరిలో ఒకరు విచారణ పెండింగ్ లో ఉండగానే 2013 అక్టోబర్‌లో మతి చెందాడు. 2014 జులైలో పోలీసులు ఛార్జీషీటు దాఖలు చేశారు. ఈ కేసులో సరైన ఆధారాలు చూపనందున ఆశారాం భార్యతోపాటు మరో ఐదుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

కాగా, 81 ఏళ్ల ఆశారాం బాపూ మరో అత్యాచార కేసులో ప్రస్తుతం జోధ్పుర్
జైలులో ఉన్నారు. రాజస్థాన్‌లోని తన ఆశ్రమంలో మైనర్ బాలికపై
అత్యాచారం చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్నారు.

English summary
Gujarat court convicts self-styled godman Asaram Bapu in another rape case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X