ఇద్దరు ప్రియులతో కలిసి రెండో భర్తను చంపిన మహా ఇల్లాలు!
గుజరాత్‌లో సమాజం నివ్వెరపోయే దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన మొదటి భర్తను వదిలి అతని సోదరుడితో ప్రేమలో పడి రెండో పెళ్లి చేసుకుంది. ఆపై మరో ఇద్దరితోనూ ప్రేమాయణం నడిపింది. రెండో భర్తను కూడా తన ఇద్దరు కలిసి హత్య చేసి, దాన్ని ప్రమాదంగా చూపించేందుకు ప్రయత్నించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఆమె అక్రమ సంబంధాలను బయటపెట్టింది.
భర్తను వదిలేసి భర్త సోదరుడిని పెళ్లి చేసుకున్న మహిళ
గుజరాత్ కు చెందిన జాగృతి అనే మహిళకు కొన్నేళ్ల క్రితం సుఖ్‌దేవ్‌గిరితో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమె సుఖ్‌దేవ్ సోదరుడు శాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. భర్త, పిల్లలను నిర్దాక్షిణ్యంగా వదిలేసి మరో గ్రామానికి వెళ్లి శాంతిగిరిని రెండో భర్తగా చేసుకుంది. శాంతిగిరి ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తుండటంతో ఇంట్లో లేని సమయాల్లో జాగృతి మరో వ్యక్తి కాంతిలాల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

వేరే వాళ్ళతోనూ అక్రమ సంబంధాలు.. రెండో భర్తను చంపాలని ప్లాన్
కాంతిలాల్ ఆమె ఇంటి పక్కనే గది అద్దెకు తీసుకుని వారి సంబంధాన్ని కొనసాగించాడు.ఇక అతని మోజులో పడిన జాగృతి రెండో భర్త శాంతిగిరి వారి అక్రమ సంబంధానికి అడ్డంకిగా మారాడని అతని అడ్డు తొలగించుకోవాలని భావించింది. దీంతో జాగృతి తన ప్రియుడు కాంతిలాల్‌తో కలిసి భర్తను చంపాలని ప్లాన్ చేసింది. ముందుగా యూనిస్ అనే వ్యక్తికి రూ.25,000 సుపారీ ఇచ్చి హత్య చేయించాలని ప్రయత్నించింది.
ప్రియులతో కలిసి రెండో భర్తను చంపిన మహిళ
కానీ యూనిస్ చంపటానికి భయపడి నిద్రపోతున్న ఫోటో తీసి పంపి, హత్య చేశానని అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుని పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన జాగృతి, కాంతిలాల్‌తో కలిసి స్వయంగా శాంతిగిరిని హత్య చేసింది. హత్య అనంతరం మృతదేహాన్ని కారులో బయటకు తీసుకెళ్లి సురేంద్రనగర్ సమీపంలోని కాలువలో విసిరేశారు. దీనికి దీపక్ అనే మరో వ్యక్తి సహాయం తీసుకుంది.
పోలీసుల దర్యాప్తులో కిలేడి గుట్టు రట్టు
దీపక్‌తో కూడా ఆమెకు అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శాంతిగిరి గురించి అడిగితే కొత్త ఉద్యోగం చేస్తున్నాడు, నంబర్ మార్చాడు అని అబద్ధాలు చెప్పి కాలం గడిపేసింది. గతేడాది అక్టోబర్‌లో కాలువలో మృతదేహం లభ్యమైనప్పుడు పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. లోతుగా దర్యాప్తు చేపట్టగా ఈ కుట్ర బయటపడింది. పోలీసులు జాగృతి, కాంతిలాల్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications