కాంగ్రెస్ సభలో దూసుకొచ్చిన ఎద్దు - బీజేపీ కుట్రేనట..!!

అహ్మదాబాద్: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. డిసెంబర్ 1వ తేదీన తొలి విడత, 5వ తేదీన మలి విడత పోలింగ్ జరుగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే పోలింగ్‌ను ముగించుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ఓట్లను లెక్కిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారతీయ జనత పార్టీ అధికారంలో ఉంది. ఈ దఫా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది 8వ తేదీన తేలిపోతుంది.

తొలి విడత పోలింగ్‌కు ఈ సాయంత్రంతో గడువు ముగియబోతోంది. దీనితో అన్ని పార్టీలు తమ ప్రచార ఉధృతిని పెంచాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం వల్ల- అందరి దృష్టీ ఈ ఎన్నికలపైనే నిలిచింది. ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠభరితంగా మారింది. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ రాష్ట్రంలో బీజేపీని ఓడించగలిగితే దాని పానుకూల ప్రభావం 2024 నాటి సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని భావిస్తోన్నాయి.

 Gujarat Election 2022: A bull entered in Congress public meeting in Mehsana

గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటన్నింటికీ రెండు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీన 89 సీట్లు, 5వ తేదీన మిగిలిన 93 స్థానాలకు పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది. మొత్తం 4,90,89,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తమ అభ్యర్థులను ఎన్నుకోనున్నారు.

ప్రచారం జోరుగా సాగుతోన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెహసానాలో కాంగ్రెస్ ప్రచార సభ కొనసాగుతున్న సమయంలో ఓ ఎద్దు ఉన్నట్టుండి సభలో దూసుకొచ్చింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వేదిక మీద ప్రసంగిస్తోన్న సమయంలో అనూహ్యంగా ఎద్దు కలకలం రేపింది. పరుగెత్తుకుంటూ వచ్చిన ఎద్దును చూసి.. సభకు హాజరైన వారు గందరగోళానికి గురయ్యారు.

 Gujarat Election 2022: A bull entered in Congress public meeting in Mehsana

తమ వైపు ఎక్కడ వస్తుందోనని భయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్నాయి.
వేదిక ఎదురుగా కాస్సేపు నిల్చున్న తరువాత ప్రజల మధ్యకు దూసుకెళ్లింది. దీనితో వారు కుర్చీలను ఎత్తిపట్టకుని దారి దారి ఇచ్చారు. దీన్ని బీజేపీ కుట్రగా అభివర్ణించారు అశోక్ గెహ్లాట్. కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలు ఎక్కడ జరిగినా దాన్ని భగ్నం చేయడానికి బీజేపీ నాయకులు ఆవులు, ఎద్దులను ఉద్దేశపూరకంగానే వదులుతుంటారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+