ఆత్మహత్య కాదు, వేముల రోహిత్‌ని ప్రభుత్వమే చంపింది: రాహుల్ గాంధీ
గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఉదంతాన్ని ప్రస్తావించారు.
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఉదంతాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకోలేదని, ప్రభుత్వం హత్య చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
విశ్వవిద్యాలయంలో చేరాలని రోహిత్ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడని, అయితే మంత్రి రాసిన లేఖ ద్వారా అతని కెరీర్‌ను నాశనం చేశారని, భారత ప్రభుత్వమే అతన్ని హత్య చేసిందని ఆయన అన్నారు. రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించడానికి వచ్చిన ఆయన శుక్రవారం ఆ వ్యాఖ్యలు చేశారు.

వేముల రోహిత్ అనే దళిత పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ నిరుడు హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది స్మ్గతి ఇరానీపై, బండారు దత్తాత్రేయపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
సనంద్ పట్టణం సమీపంలోని దళిత్ శక్తి కేంద్ర (డిఎస్‌కె) వొకేషనల్ శిక్షణా సంస్థను రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. దళిత కార్యకర్త ఆ సంస్థను నడుపుతున్నారు.












Click it and Unblock the Notifications