గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీ సంచలనం: ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

గాంధీనగర్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంచలన నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణా చర్య పేరిట కాషాయ పార్టీ టిక్కెట్లు నిరాకరించిన తరువాత స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన ఏడుగురు పార్టీ నాయకులను సస్పెండ్ చేసింది. ఏడుగురు అభ్యర్థులు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో టిక్కెట్లు కోరుతున్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ ఎమ్మెల్యేలను ఆరేళ్లపాటు సస్పెండ్‌ చేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Gujarat Elections 2022: BJP suspends seven rebel MLAs in poll bound state.

నర్మదా జిల్లా నందోద్‌కు చెందిన హర్షద్ వాసవ సస్పెండ్‌కు గురైన బీజేపీ నేత. ఆయనతోపాటు జునాగఢ్‌లోని కేశోద్ జునాగఢ్ నుంచి టికెట్ ఆశించిన అరవింద్ లడానీ కూడా సస్పెండ్ అయ్యారు. సురేంద్రనగర్‌లోని ధంగద్రా నుంచి ఛత్రసింగ్ గుంజరియా, వల్సాద్‌లోని పారాడి నుంచి కేతన్ భాయ్ పటేల్, రాజ్‌కోట్ రూరల్ నుంచి భరత్ భాయ్ చావ్డా, గిర్ సోమనాథ్ జిల్లా వెరావల్ నుంచి ఉదయ్ భాయ్ షా, అమ్రేలీ రాజులా నుంచి టికెట్ ఆశించిన కరణ్ భాయ్ బరయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు.

గుజరాత్‌లో ఏడోసారి అధికారాన్ని కోరుతున్న బీజేపీ 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది. 160 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించిన కాషాయ పార్టీ 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించింది. పలువురు పార్టీ పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌లకు టిక్కెట్లు నిరాకరించింది. 2017 గుజరాత్ ఎన్నికల్లో 182 స్థానాలకు గాను 99 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.

బీజేపీ గత 27 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నుకోబడటానికి ముందు నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి, ప్రధాని మోడీ, అమిత్ షా, సీఆర్ పాటిల్ నాయకత్వంలో పార్టీ అత్యధిక సీట్ల సంఖ్య 140కి మించాలనే లక్ష్యంతో ఉంది.

గుజరాత్ రాష్ట్రం చాలా కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉంది, ఏడోసారి అధికారంలోకి రావాలని ఆ పార్టీ దృష్టి పెట్టింది.

182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న గుజరాత్ రాష్ట్రంలో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ ఫలితాల తేదీతో పాటు డిసెంబర్ 8న గుజరాత్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+