వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ: గుజరాత్ లో రాహుల్ గాంధీ హామీ

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. అధికారంలోకి వస్తే తాము రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. అధికారంలోకి వస్తే తాము రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రాభవానికి గండికొట్టాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అమ్రేలిలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లో రుణమాఫీపై తమ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు.

rahul-gandhi

పారిశ్రామిక వేత్తలకు 1.25 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన ప్రధాని మోడీని తాము రైతు రుణమాఫీ గురించి అడిగితే.. అది తమ విధానం కాదని తోసిపుచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

గత 22 ఏళ్లుగా రైతుల గురించి మాట్లాడుతున్న మోడీ వారికి చేసిందేమీ లేదని అన్నారు. రైతుల భూములు లాక్కుని సాగు నీటితో సహా వాటిని పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు.

రైతులకు కనీసం పంట బీమా కూడా అందలేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఒక రబ్బర్ స్టాంప్ అని వ్యాఖ్యానించారు. గుజరాత్ రాష్ట్ర పాలన అమిత్ షా చేతిలో ఉందని అన్నారు.

గుజరాత్‌ లో పటేళ్లు, దళితులు, రైతులు, అంగన్‌ వాడీ కార్యకర్తలు సహా అన్ని వర్గాల ప్రజలు తొలిసారిగా నిరసన బాటపట్టారని రాహుల్ అన్నారు. విమానాల్లో తిరిగే మోడీ స్నేహితులు ఐదుగురు లేక పదిమంది మాత్రమే గుజరాత్ లో సంతోషంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.

English summary
Congress vice-president Rahul Gandhi on Thursday tried to woo farmers during his campaign for Gujarat elections by promising them farm loan waivers if his party forms the government in the state. Calling Gujarat chief minister Vijay Rupani a “rubber stamp”, he alleged that Bharatiya Janata Party (BJP) president Amit Shah was remote-controlling the government in the western state. “(Prime Minister Narendra) Modiji waived loans worth Rs1.25 trillion of his 5-10 industrialist friends, but Modiji and (finance minister Arun) Jaitleyji say that it is not their policy to waive loans of farmers when they ask for it,” Gandhi claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X