వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రానికి గుజరాత్ షాక్.. 50 శాతం ట్రాఫిక్ జరిమానాలు తగ్గింపు

|
Google Oneindia TeluguNews

కొత్త ట్రాఫిక్ నిబంధనలతో ప్రజలు అందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే.. కేంద్రం నూతన చట్టాన్ని తీసుకువచ్చిందే తడవుగా వెంటనే ఆ చట్టాన్ని మెజారీటి రాష్ట్రాలు హుటాహుటిన అమలు చేస్తున్నాయి. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఢిల్లీ,హర్యాణ, రాజస్థాన్ లాంటీ రాష్ట్రాలు కూడ చట్టాన్ని ఎలాంటీ సవరణలు లేకుండా యధావిధిగా అమలు చేస్తున్నాయి.

అయితే ఇందుకు విరుద్దంగా బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ కేంద్రానికి షాక్ ఇచ్చింది. కేంద్రం చేపట్టిన నూతన వాహన చట్టం సవరణ బిల్లును ఆ రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించింది. ఇప్పటికే జరిమానాలపై పలు రాష్ట్రాల్లో ప్రజల నుండి వ్వతిరేకతలు వస్తుండడంతో గుజరాత్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధాని మోడీ స్వంత రాష్ట్రమైనా అక్కడ వ్యతిరేకత రాకుండా ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే గుజరాత్ సీఎం విజయ్ రూపాని ప్రజలకు ఉపశమనం కల్గించే చర్యలు చేపట్టింది.

Gujarat has reduced fines by 50 percent in traffic fines

కోత్త ట్రాఫిక్ చట్టంలో కేంద్రం విధించిన జరిమానాలను సగానికి తగ్గించింది. కేంద్రం చట్టాన్ని సవరణ చేస్తూ జరిమానాలను 50 శాతానికి పైగా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఫైన్ల మోత మోగిస్తుటే.. అదే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో సీఎం విజయ్ రూపానీ జరిమానాలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించారు. ఏకంగా 50శాతం మేర తగ్గించడంతో వాహనదారులు రిలాక్స్ అవుతున్నారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రమే మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తే ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తారో వేచి చూడాలి.

English summary
Gujarat government reduced high fines of 50 percent which is imposed Motor Vehicles (Amendment) Act 2019,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X