వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ కాంగ్రెస్‌కు షాక్: పార్టీ ఆఫీసులపై పాటిదార్ల దాడి, ‘డీల్’ ఏమవుతుందో?

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలించి. గుజరాత్‌ ఎన్నికల్లో భాగంగా పటీదార్‌ అనమత్‌ ఆందోళన్‌ సమితి(పాస్)తో పొత్తు కుదిరిందని ప్రకటన వెలువడిన కాసేపటికే పరిస్థితులు తారుమారయ్యాయి. టికెట్ల పంపిణీ చిచ్చు రాజుకుని సూరత్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద పటేల్‌ వర్గీయులు-కాంగ్రెస్‌ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో పార్టీ ఆఫీస్‌ను పూర్తిగా ధ్వంసం చేసేశారు.

 జాబితాతో మొదలైన వివాదం

జాబితాతో మొదలైన వివాదం

వివాదం ఎక్కడ మొదలైందంటే.. హార్దిక్‌ పటేల్‌ నాయకత్వం వహిస్తున్న పాస్‌కు గుజరాత్‌ ఎన్నికల్లో స్థానాల కేటాయింపుపై విస్తృత చర్చలు జరిగాయి. ఎట్టకేలకు పటేల్‌ కమ్యూనిటీతో ఒప్పందం కుదిరి.. కాంగ్రెస్‌ ఆదివారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 77 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో ఇద్దరు హార్దిక్‌ పటేల్‌ సన్నిహితులకు టికెట్‌ లభించింది. ఇక్కడ్నుంచే వివాదం మొదలైంది.

కాంగ్రెస్ కార్యాలయంపై దాడి

అయితే, తాము ఆశించిన మేర టికెట్లను కేటాయించలేదని, తమను సంప్రదించకుండానే సీట్ల ఒప్పందం జరిగిందని పాటిదార్‌ ఆందోళన్‌ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాస్‌ సభ్యులు కొందరు ఆదివారం రాత్రి సూరత్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయంపై దాడి చేశారు.

 మిగితా ప్రాంతాల్లోనూ దాడులు..

మిగితా ప్రాంతాల్లోనూ దాడులు..

సూరత్‌లోనే గాక, అహ్మదాబాద్‌ తదితర ప్రాంతాల్లోనూ పటేల్‌ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

తమతో సంప్రదించకుండానే సీట్ల ఒప్పందం జరిగిందని, దీనిపై కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని పాస్‌సభ్యులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు పటీదార్‌ నేత దినేశ్‌ పటేల్ పలువురు కార్యకర్తలను వెంటపెట్టుకుని గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు భరత్‌సిన్హ్‌ సోలంకి ఇంటికి వెళ్లారు. అయితే భరత్‌ మాత్రం వారిని కలిసేందుకు నిరాకరించటంతో బయటే ఆందోళన చేపట్టారు.

డీల్ ప్రశ్నార్థకమేనా?

డీల్ ప్రశ్నార్థకమేనా?

‘కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై పునరాలోచన చేస్తాం. నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తాం. మేము వారిని(కాంగ్రెస్‌) అడిగేది ఒక్కటే. అధికారంలోకి వచ్చాక పటేల్‌ వర్గానికి ఇచ్చిన హామీలను(రిజర్వేషన్లను) ఎలా నెరవేర్చబోతున్నారు అన్నది తేల్చాలి. అప్పుడే వారి తరపున ప్రచారానికి మేము సిద్ధంగా ఉంటాం' అని దినేశ్‌ పటేల్‌ మీడియాకు తెలిపారు. ఇది ఇలావుంటే.. సోమవారం రాజ్‌కోట్‌లో జరిగే సమావేశంలో ఒప్పందం గురించి హార్దిక్‌ పటేల్‌ అధికారిక ప్రకటన చేయనున్నారు. పాటిదార్ల ఆందోళన నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదురుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

English summary
The Hardik Patel-Congress deal has hit a road bump ahead of the Gujarat assembly elections. Although the Congress and PAAS reached an agreement on seat sharing, a late night development appeared to change the course of the agreement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X