బిజెపికి షాక్: రాజ్యసభకు అహ్మద్ పటేల్, నెక్ట్స్ టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలే
గాంధీనగర్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకొన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్ట చీఫ్ సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. బిజెపి నుండి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీలు విజయం సాధించారు.
గుజరాత్ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సమయం నుండి కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియన్ నేత శంకర్‌సింగ్ వాఘేలా పార్టీని వీడారు. ఆయనతో పాటు 6 ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. అయితే బిజెపి నేతలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయం సాధించారు. అయితే బిజెపి ఎత్తుగడలను పసిగడుతూ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహం ఎట్టకేలకు ఫలించింది.
మరోవైపు మంగళవారం నాడు పోలింగ్ రోజున చోటుచేసుకొన్న పరిణామాల్లో కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ వ్యూహత్మకంగా వ్యవహరించారు. ఒకానొక సందర్భంలో ఈ ఎన్నికను రద్దు చేయాలని కూడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేసింది.

అహ్మద్ పటేల్ విజయం
ఎఐసిసి చీఫ్ సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన రాజ్యసభకు ఐదోసారి ఎన్నికయ్యారు. అయితే ఈ స్థానం నుండి అహ్మద్ పటేల్ ఎన్నిక కాకుండా బిజెపి చేసిన ఫ్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. పోలింగ్ సందర్భంగా అక్రమాలు చోటుచేసుకొన్నాయని, ఈ ఎన్నికలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను కోరింది. కాంగ్రెస్, బిజెపిలు ఒకరిపై మరోకరు ఫిర్యాదులు చేసుకొన్నారు. అయితే ఎట్టకేలకు ఈ ఎన్నికలో అహ్మద్ పటేల్ విజయం సాధించారు. బిజెపి నుండి అమిత్‌షా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విజయం సాధించారు.
Recommended Video


మ్యాజిక్ ఫిగర్‌ను దక్కించుకొన్న అహ్మద్ పటేల్
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి ఓటు చేశారు. .బోలాబాయ్ గోహిల్, రాఘవ్‌బాయ్ పటేల్‌లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్‌పటేల్‌కు కాకుండా బిజెపికి ఓటు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఈ ఇద్దరి ఓట్లు చెల్లకుండా చేయాలని ఫిర్యాదు చేసింది. దీంతో కౌంటింగ్ నిలిపివేశారు. అధికారులు. మంగళవారం అర్ధరాత్రి పదకొండున్నర గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రెండు ఓట్లు చెల్లుబాటు కావడం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ ఎన్నికల్లో మొత్తం 176 మంది తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. అయితే ఇద్దరి ఓట్లు చెల్లుబాటుకాకపోవడంతో మ్యాజిక్ ఫిగర్ 44కు చేరుకొంది. 44 ఓట్లు వస్తే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అవుతారు. అహ్మద్ పటేల్ కు 44 ఓట్లు దక్కడంతో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

నెక్ట్స్ టార్గెట్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే
ఈ విజయంతో అధికార బిజెపిపై దూకుడును పెంచారు అహ్మద్ పటేల్. తననను ఓడించేందుకుగాను బిజెపి అధికారబలాన్ని, డబ్బును ఉపయోగించిందని ఆయన ట్విట్టర్‌లో ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో తాను విజయం సాధించడం సాధారణ విజయం కాదన్నారు. సత్యమేవజయతే అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన తదుపరి లక్ష్యం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే అంటూ ఆయనట్వీట్ చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు
అహ్మద్ పటేల్ ఓడించేందుకుగాను మూడో అభ్యర్థిని రంగంలోకి దించి బిజెపి అనేక పథకాలను రచించింది. అయితే బిజెపి ప్లాన్ సక్సెస్ కాలేదు. ఈ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ విజయం సాధించడం గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మానసిన స్థైర్యాన్ని ఇస్తోంది.. పటేల్ గెలిచిన వెంటనే బాణసంచా కాల్చుతూ , ర్యాలీలు నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications