వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం-గేదెల యజమానులపై గుజరాత్ ఆర్పీఎఫ్ కేసు..

|
Google Oneindia TeluguNews

గుజరాత్ పోలీసుల తీరు మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా గుజరాత్ లో ప్రయాణిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఓ స్టేషన్ దగ్గర అకస్మాత్తుగా ట్రాక్ పైకి వచ్చేసిన గేదెల్ని ఢీకొట్టింది. దీంతో రైలు ముందుభాగం దెబ్బతింది. దీనికి కారణం రైల్వే ట్రాక్ పైకి వచ్చేసిన గేదెలేనని గుజరాత్ పోలీసులు తేల్చారు.

గుజరాత్‌లో ప్రయాణిస్తున్న ముంబై-గాంధీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను గేదెల మంద ఢీకొన్న 24 గంటల తర్వాత, గుజరాత్‌ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులు పశువుల యజమానులపై కేసు నమోదు చేశారు. గేదెల్ని ట్రైన్ ఢీకొన్న ఘటనలో ఈ సెమీ-హై స్పీడ్ రైలు డ్రైవర్ కోచ్ ముక్కు దెబ్బతింది. దీంతో ఆయనకు శస్త్రచికిత్స చేశారు. అయితే గేదెల యజమానులను రైల్వే పోలీసులు ఇంతవరకు గుర్తించలేకపోయారు. దీంతో వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

 gujarat rpf case against owners of buffaloes hit by vande bharat express yesterday

మరోవైపు అహ్మదాబాద్‌లోని వత్వ-మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య వందేభారత్ రైలు మార్గంలో వచ్చిన గేదెల గుర్తుతెలియని యజమానులపై ఆర్‌పిఎఫ్ ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసిందని పశ్చిమరైల్వే సీనియర్ ప్రతినిధి (అహ్మదాబాద్ డివిజన్) జితేంద్ర కుమార్ జయంత్ వెల్లడించారు. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 147 ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ శర్మ తెలిపారు. నాలుగు గేదెలు మృతి చెందిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

English summary
gujarat police have filed case against the owners of buffaloes hit by vande bharat express recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X