గుజరాత్ వరుస పేలుళ్ల కేసులో దోషి తండ్రి సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తే: యోగి ఆదిత్యనాథ్ ఫైర్

లక్నో: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాజకీయ ప్రత్యర్థి అఖిలేష్ యాదవ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. 2008 గుజరాత్ వరుస పేలుళ్ల కేసులో దోషి తండ్రి ఒకరు సమాజ్ వాదీ పార్టీ కార్యకర్త అని అన్నారు. సోమవారం హర్దోయ్‌లో జరిగిన ర్యాలీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు.

ఈ వాదనలు చేస్తూనే.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ క్షమాపణలు చెప్పాలని సీఎం యోగి డిమాండ్ చేశారు. వరుస పేలుళ్ల కేసులో అజంగఢ్‌కు ఉన్న లింక్‌ను కూడా ఆయన ఎత్తిచూపారు.

 Gujarat Serial Blasts Case Convicts Father A SP Worker: After PM Modi, Yogi Links Akhilesh Party.

'అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ కోర్టు 38 మందిని దోషులుగా నిర్ధారించింది. వీరిలో 8 మందికి అజంగఢ్‌తో సంబంధం ఉంది. ఈ 8 మంది దోషుల్లో ఒక దోషి తండ్రి సమాజ్‌వాదీ పార్టీ క్రియాశీల కార్యకర్త. SP చీఫ్ క్లారిటీ ఇచ్చి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి" అని సీఎం యోగి వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది.

ముఖ్యంగా, ఆజంగఢ్ ఈ ప్రాంతంలో సమాజ్ వాదీ పార్టీకి బలమైన నియోజకవర్గంగా పరిగణించబడుతుంది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందారు.

ఆదివారం జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌ వరుస పేలుళ్ల కేసును సమాజ్‌వాదీ పార్టీతో ముడిపెట్టిన నేపథ్యంలో సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. గుజరాత్‌లో జరిగిన పేలుళ్లకు ఎస్పీ 'సైకిల్' పార్టీ గుర్తును లింక్ చేశారు.

'మీరు ఎస్పీ పోలింగ్ గుర్తు చూశారా? తొలి పేలుళ్లలో బాంబులన్నీ సైకిళ్లపై అమర్చబడ్డాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను, వారు సైకిళ్లను ఎందుకు ఉపయోగించారు?" అని ప్రశ్నించారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మూడవ దశ పోలింగ్ ఫిబ్రవరి 20న ముగిసింది, దాదాపు 63% ఓటింగ్ నమోదైంది. మిగిలిన దశల ఎన్నికలు ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+