కూతురి అసభ్యకర వీడియో ప్రసారంపై నిరసన: జవానును కొట్టి చంపారు
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కుమార్తె అసభ్యకర వీడియోని ప్రసారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టినందుకు ఓ జవానును ప్రత్యర్థులు కొట్టి చంపారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్‌లో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్ కూతురుపై ఒక అసభ్యకర వీడియోను 15 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్‌లో పోస్టు చేశాడు. ఈ విషయంపై సదరు జవాను ఆ యువకుడితో కుటుంబంతో మాట్లాడేందుకు వెళ్లాడు.

జవానుతోపాటు భార్య, ఇద్దరు కుమారులు, మేనల్లుడితో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో యువకుడి కుటుంబం, వీరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో యువకుడి కుటుంబసభ్యులు జవానుపై దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో జవాను మృతి చెందారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, నిందిత యువకుడు, బాధిత యువతికి మధ్య పరిచయం ఉన్నట్లు తెలిసింది. వీరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ, ఆమెకు సంబంధించిన అభ్యంతకర వీడియోను యువకుడు ప్రసారం చేశాడు. దీంతోనే ఇరుకుటుంభాల మధ్య ఘర్షణ జరిగింది.












Click it and Unblock the Notifications