ఇంకొన్ని గంటల్లో ఆ సస్పెన్స్‌కు తెర: గుజరాత్‌కు కమలం హైకమాండ్ దూతలు: పటిదార్లకు ఛాన్స్
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేసింది భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం. ఉత్తరాఖండ్, అస్సాం, కర్ణాటక తరహాలో ముఖ్యమంత్రిని ఇంటికి సాగనంపింది. గుజరాత్‌లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తోన్నాయంటూ అందిన నివేదిక ఆధారంగా మోడీ- అమిత్ షా జోడీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ రుపాణీతో రాజీనామా చేయించింది.

కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ఇంకొన్ని గంటల్లో..
కొత్త ముఖ్యమంత్రి ఎంపిక ఇంకొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఈ ఉదయం 10 గంటలకు బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ సమావేశం సందర్భంగా- బీజేపీ ఎమ్మెల్యేలు తమ కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటలోగా పూర్తవుతుందని తెలుస్తోంది. అనంతరం ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖతో కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాయకుడు గవర్నర్‌ను కలుస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా విజ్ఙప్తి చేస్తారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను గవర్నర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గుజరాత్‌కు కేంద్రమంత్రులు..
ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ కోసం పార్టీ అధిష్ఠానం దూతలుగా ఇద్దరు కేంద్ర మంత్రులు గుజరాత్‌కు వెళ్లనున్నారు. బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, వ్యవసాయం- రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ప్రత్యేక ఆహ్వానితులుగా బీజేపీ సభాపక్ష సమావేశానికి హాజరవుతారు. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ఇప్పటికే కొన్ని ఫ్రంట్ రన్నర్ల పేర్లు విస్తృతంగా వినిపిస్తోన్నాయి.

కేంద్రమంత్రి మాండవీయ సహా..
గుజరాత్ ముఖ్యమంత్రి పదవి కోసం ఫ్రంట్ రన్నర్లుగా చాలా పేర్లే వినిపిస్తోన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ భాయ్ మాండవీయ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, దాద్రా నగర్ హవేలి-లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ పేర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గుజరాత్ పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తమ్ ఖోడాభాయ్ రుపాల, వ్యవసాయం-రవాణా శాఖ మంత్రి రణ్‌ఛోద్ భాయ్ ఛనాభాయ్ ఫాల్దు, మాజీ హోం శాఖ మంత్రి గోర్డాన్ జడాఫియా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.

మన్‌సుఖ్‌కు మరో ప్రమోషన్ ఇస్తారా?
మన్‌సుఖ్ మాండవీయ ఇదివరకు కేంద్ర కేబినెట్‌లో సహాయమంత్రిగా పనిచేశారు. ఆయన పనితీరును నచ్చడంతో మోడీ-అమిత్ షా జోడీ.. ఆయనకు ప్రమోషన్ ఇచ్చింది. కేబినెట్ మంత్రిగా పదోన్నతి కల్పించింది. ఇక గుజరాత్ సారథ్య బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మన్‌సుఖ్ మాండవీయ కోసం అప్పటిదాకా ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన డాక్టర్ హర్షవర్ధన్‌పై వేటు వేయడానికి కూడా మోడీ-అమిత్ షా జోడీ వెనుకాడలేదు. ఆయనను తప్పించి మరీ- ఆ శాఖను మన్‌సుఖ్ మాండవీయకు అప్పగించింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయారనే కారణంతో డాక్టర్ హర్షవర్ధన్‌ను తప్పించింది ఈ జోడీ.

పటిదార్ సామాజిక వర్గానికి..
గుజరాత్‌లో బలమైన ఓటుబ్యాంక్‌గా ఉంటూ వస్తోన్న పటిదార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించడం దాదాపుగా ఖాయమైనట్టే కనిపిస్తోంది. పటిదార్ సామాజిక వర్గం మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారంటూ నివేదికలు అందడం వల్ల బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయాన్ని తీసుకుందని చెబుతున్నారు. పటిదార్ ఓటుబ్యాంకును ఆకర్షించడంలో భాగంగా.. అదే సామాజిక వర్గ నాయకుడికి ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తారనే ప్రచారం గుజరాత్‌లో జోరుగా సాగుతోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications