6 నెలల్లో 5మంది ముఖ్యమంత్రులను ఇంటికి పంపించిన మోడీ-అమిత్ షా జోడీ: ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయిదు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటిల్లో మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవాల్లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతోంది. ఈ ఏడాది నిర్వహించిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఆ ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందే గుజరాత్‌లో ముఖ్యమంత్రిని మార్చి వేసింది. ముఖ్యమంత్రిగా కొత్త ముఖాన్ని రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయనుంది.

బీజేపీ ముఖ్యమంత్రులకు గడ్డు రోజులు..
అసెంబ్లీ ఎన్నికల మాటేమిటో గానీ.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోన్నారు. తమ పదవి ఉంటుందో.. ఊడుతుందో తెలియని స్థితిలో ఉన్నారు. పరిపాలన ఏ రకంగా ఉన్నా.. మళ్లీ అధికారంలోకి రాగలుగుతామో.. లేదో అనే అనుమానాలు పార్టీ అధిష్ఠానాన్ని పట్టి పీడిస్తున్నాయనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రాన్నయినా కోల్పోతే.. తలవంపులుగా పరిగణిస్తోంది బీజేపీ హైకమాండ్.

త్రివేంద్ర సింగ్ రావత్‌తో మొదలు..
మొదట- ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రిగా పని చేసిన త్రివేంద్ర సింగ్ రావత్‌ను తప్పించింది బీజేపీ అధిష్ఠానం. ఆయన స్థానంలో లోక్‌సభ సభ్యుడు తీరథ్ సింగ్ రావత్‌ను ముఖ్యమంత్రిగా నియమించింది. ఈ ఏడాది మార్చిలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అధికారంలో ఉన్నది నాలుగు నెలలు మాత్రమే. పనితీరు నచ్చకపోవడంతో తీరథ్ సింగ్ రావత్‌పై వేటు వేసింది బీజేపీ. ఆయన స్థానంలో పుష్కర్ సింగ్ ధమీ నియమితులయ్యారు. నాలుగు నెలల్లో ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలనను చవి చూసింది ఉత్తరాఖండ్. పుష్కర్ సింగ్ ధమి సారథ్యంలోనే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.

అధికారంలోకి తెచ్చిన ముఖ్యమంత్రిని కాదని..
అదే ముఖ్యమంత్రి మార్పు అస్సాంలోనూ చోటు చేసుకుంది. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని కాదని.. కొత్త నాయకుడికి ఆ బాధ్యతలను అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల ముగిసిన తరువాత రెండు-మూడువారాల పాటు అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. శర్బానంద సొనొవాల్‌ను తప్పించి.. ఆయన స్థానంలో హిమంత బిశ్వశర్మకు అవకాశం ఇచ్చింది. హిమంత బిశ్వశర్మ పుట్టినిల్లు కాంగ్రెస్ పార్టీ.
అస్సాంలో చోటు చేసుకున్న కొన్ని రాజకీయ పరమైన ఒత్తిళ్లకు తలొగ్గడం వల్లే బీజేపీ హైకమాండ్- శర్బానంద సొనొవాల్‌ను తప్పించి, హిమంతకు ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించిందనే అంచనాలు ఉన్నాయి. అనంతరం శర్బానందకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది.

కర్ణాటకలోనూ అదే తీరు..
కర్ణాటకలోనూ ముఖ్యమంత్రిని మార్చి వేసింది బీజేపీ అధిష్ఠానం. బీఎస్ యడియూరప్పకు ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మైని నియమించింది. దక్షిణాదిన కాషాయపార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక నాయకుడిగా గుర్తింపు ఉంది- బీఎస్ యడియూరప్పకు. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి.. ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నప్పటికీ- ఆపరేషన్ కమలను చేపట్టి కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కూల్చి మరీ బీజేపీని అందలం ఎక్కించారాయన. అలాంటి సీనియర్ నేత నాయకత్వాన్ని కూడా విశ్వసించలేని పరిస్థితి బీజేపీ హైకమాండ్‌లో నెలకొంది.

మోడీ సొంత రాష్ట్రం కావడంతో..
గుజరాత్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ టాప్ లీడర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. విజయ్ రుపాణిపై వ్యతిరేకత ఉందంటూ పార్టీ క్యాడర్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆయనపై వేటు వేసినట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంతో పాటు- ప్రభుత్వపరంగా కొన్ని వైఫల్యాలు పార్టీ ప్రతిష్ఠను మసకబారేలా చేశాయని మోడీ- అమిత్ షా జోడీ నిర్ణయానికి రావడం వల్లే ఆయనను తప్పిించినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రుల మార్పుతో..
ఇలా వరుసగా ముఖ్యమంత్రుల మార్పు వ్యవహారం ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందనే సంకేతాలను పంపించినట్టయింది. ఏకంగా పెద్ద తలకాయలనే పక్కకు తప్పించాల్సిన స్థాయిలో బీజేపీపై చాప కింద నీరులా వ్యతిరేకత నెలకొందనే విషయాన్ని బహిర్గతం చేసినట్టయింది. ఇదే పరిస్థితి అటు ఉత్తర ప్రదేశ్, గోవాల్లో కూడా కనిపిస్తుందా? లేదా? అనే గ్యారెంటీ కూడా ఉండట్లేదు. రేపో, మాపో.. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితులు నెలకొన్నాయనే వాదనలు వినిపిస్తోన్నాయి.

రేసులో ఉన్నదెవరు?
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఫ్రంట్ రన్నర్లుగా చాలా పేర్లే వినిపిస్తోన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ భాయ్ మాండవీయ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, దాద్రా నగర్ హవేలి, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ పేర్లు వినిపిస్తోన్నాయి. మన్‌సుఖ్ మాండవీయ ఇదివరకు కేంద్ర కేబినెట్‌లో సహాయమంత్రిగా పనిచేశారు. ఈ ముగ్గురితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. పర్షోత్తమ్ రుపాల, గుజరాత్ వ్యవసాయం-రవాణా శాఖ మంత్రి రణ్‌ఛోద్ భాయ్ ఛనాభాయ్ ఫాల్దు, గోర్ధాన్ జడాఫియా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.

మన్‌సుఖ్‌కు
ఆయన పనితీరును నచ్చడంతో మోడీ-అమిత్ షా జోడీ.. ఆయనకు ప్రమోషన్ ఇచ్చింది. కేబినెట్ మంత్రిగా పదోన్నతి కల్పించింది. ఇక గుజరాత్ సారథ్య బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మన్‌సుఖ్ మాండవీయ కోసం అప్పటిదాకా ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన డాక్టర్ హర్షవర్ధన్‌పై వేటు వేయడానికి కూడా మోడీ-అమిత్ షా జోడీ వెనుకాడలేదు. ఆయనను తప్పించి మరీ- ఆ శాఖను మన్‌సుఖ్ మాండవీయకు అప్పగించింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయారనే కారణంతో డాక్టర్ హర్షవర్ధన్‌ను తప్పించింది ఈ జోడీ.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications