సోపోర్‌లో ఉగ్రవాదుల కాల్పులు: ముగ్గురికి గాయాలు

శ్రీనగర్ ప్రాంతానికి 55 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో అక్కడి చేరుకున్న భద్రతా దళాలు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో ముగ్గురు పోలీసులు గాయాలపాలయ్యారని తెలిపారు.
మూసివున్న ఓ ఇంట్లో నుంచి ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారని పోలీసు అధికారులు చెప్పారు. ముగ్గురు పోలీసు అధికారులు ఈ కాల్పుల్లో గాయాలపాలవడంతో మరిన్ని బలగాలను ఇక్కడికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు పారిపోకుండా అధిక బలగాలను ఇక్కడికి తీసుకొచ్చి, ఉగ్రవాదులను చుట్టుముట్టినట్లు వారు చెప్పారు.












Click it and Unblock the Notifications