అమ్మాయి కిడ్నాప్, గ్యాంగ్ రేప్: నిందితుల్లో మిత్రుడు

గుర్గావ్: నలుగురు యువకులు తనను అపహరించి, తనపై సామూహిక అత్యాచారం చేసినట్లు ఓ 17 ఏళ్ల బాలిక ఆరోపించింది. అమ్మాయిని గుర్గావ్‌లోని ఆమె ఇంటి నుంచి ఆదివారం రాత్రి కిడ్నాప్ చేశారు. ఓ ఫ్లాట్‌లోకి తీసుకుని వెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ నలుగురిలో ఒకతను అమ్మాయికి తెలిసినవాడు.

ఆదివారం రాత్రి దారుణానికి ఒడిగట్టిన నిందితులు సోమవారం ఉదయం ఆమెను ఇంటి వద్ద వదిలేశారు. పోలీసులకు చెప్తే తీవ్రమైన పరిణామాలుంటాయని కూడా వారు బెదిరించారు. అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం - ఆమె ఉదయం 8 గంటలకు మహిళా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసింది. దాంతో పోలీసులు వచ్చి ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత పరీక్షల నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో తేలింది.

సాయంత్రం పూట ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకతను ఓపెన్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. అతనితో అమ్మాయికి పరిచయం ఉంది. వారిద్దరు తరుచుగా ఫోన్‌లో మాట్లాడుకునేవారని కాల్ రికార్డులను బట్టి తెలిసిందని పోలీసులు చెప్పారు.

 Gurgaon girl alleges gang rape by friend, 3 others

మరో నిందితుడు మైనర్, 11వ తరగతి చదువుతున్నాడు. మూడో నిందితుడు హోటల్లో పనిచేస్తున్నాడు. నాలుగో నిందితుడు పరారీలో ఉన్నాడు. మైనర్‌ను వదిలేస్తే మిగతా ముగ్గురు నిందితులు 19, 23 ఏళ్ల మధ్య వయస్సు గలవారు.

సంఘటన జరిగిన ఫ్లాట్ ఎవరిదనేది తెలియదు. పదో తరగతి చదువుతున్న అమ్మాయి, ఆ రోజు అర్థ రాత్రి తన ఇంటి బయట నిలబడి వైఫై కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ సమయంలో మిత్రుడు కారులో మరో ముగ్గురితో వస్తూ కనిపించాడు. వారితో మాట్లాడడానికి బాధితురాలు కారు వద్దకు వెళ్లింది. వాళ్లు అమ్మాయిని తమ కారులోకి లాక్కున్నారు. కారులో తీసుకుని వెళ్లి ఫ్లాట్‌లో నలుగురు కూడా ఆమెపై అత్యాచారం చేశారు.

అమ్మాయి హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడానికే ముందే కుటుంబ సభ్యులు తన అమ్మాయి కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి న్యూ కాలనీ పోలీసు చౌకీకి తెల్లవారు జామును 3 గంటలకు వెళ్లారు. అమ్మాయి వాంగ్మూలాన్ని మెజిస్టేట్ రికార్డు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+