Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డేరా బాబా లీలలు, మహిమాన్విత కూరగాయలు పేరుతో... భక్తులనే బ్లాక్ మెయిల్!

డేరా బాబాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తన భక్తుల సమక్షంలో డేరా బాబా తనని తాను భగవంతుని దూతగా చెప్పుకునేవాడు.

Recommended Video

    Ram Rahim Use To Sell Most Expensive Vegetables In His Dera, Know Why ? | Oneindia Telugu

    రోహతక్: సాధ్వీల అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా ఛీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ రోహ్‌తక్ జైలులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో డేరా బాబాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

    తన భక్తుల సమక్షంలో డేరా బాబా తనని తాను భగవంతుని దూతగా చెప్పుకునేవాడు. కొన్నిప్రత్యేక పద్ధతుల్లో వారిని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. భక్తులందరికీ బంగారం అనే పేరుతో కూరగాయలను విక్రయించేవాడట.

    అవి మహిమాన్విత కూరగాయలు...

    అవి మహిమాన్విత కూరగాయలు...

    బాబా తోటలోని కూరగాయలు కొనుగోలు చేసి తింటే ఎటువంటి రోగాలు రావని ఆయన భక్తులు చెబుతుంటారు. అందుకే వారు ఎంత ధర అయినా చెల్లించి వాటిని కొంటారు. అటువంటి మహిమాన్విత కూరగాయలు దొరికితే తమ జన్మ ధన్యమైనట్లేనని భక్తులు భావిస్తారు. బాబా తోటలోని కూరగాయల విక్రయాలు అత్యంత పకడ్బందీగా సాగుతుంటాయి.

    ప్రపంచంలోనే ఎక్కడా లేని ధరలు...

    ప్రపంచంలోనే ఎక్కడా లేని ధరలు...

    సిర్సాలో బాబా రాం రహీం సింగ్ కు సుమారు 700 ఎకరాల్లో వ్యవసాయ భూములున్నాయి. వీటిలో వివిధ రకాల పంటలు పండిస్తుంటారు. బాబా సొంత మార్కెట్‌లో కూరగాయల ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత ధరకు ఇక్కడ కూరగాయలను విక్రయిస్తారు.
    తన భక్తులకు.. తన ఇష్టమొచ్చిన ధరకు ఆ కూరగాయలను అమ్ముతాడు డేరాబాబా.

    అర కిలో చిక్కుడు గింజలు.. రూ.లక్ష

    అర కిలో చిక్కుడు గింజలు.. రూ.లక్ష

    డేరా బాబా కూరగాయల మార్కెట్ లో ఒక్క ఎర్ర మిరపకాయ దర రూ. 1000. ఒక చిన్న వంకాయ కూడా వెయ్యి రూపాయలు. అదే వంకాయి పెద్ద సైజులో ఉంటే దాని విలువ రూ.2 వేలు ఉంటుంది. చిక్కుడుకాయలోని నాలుగు గింజలను ప్యాక్‌ చేసి రూ.1000 అమ్ముతారు. ఒకవేళ ఎవరైనా సరే అరకిలో చిక్కుడు గింజలను తీసుకోవాలంటే లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

    అత్యంత సన్నిహితులకు...

    అత్యంత సన్నిహితులకు...

    తనకు అత్యంత సన్నిహితులైన భక్తులకు బాబా రాం రహీం సింగ్ ఒక్కో బొప్పాయిని విక్రయిస్తారు. దీని ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ.5 వేలు. బాబా చేతుల మీదుగా రెండు టమాటాలు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. బాబా తోటలో ఈ కూరగాయలు విక్రయించేందుకు ప్రత్యేంగా కొంతమంది పని చేస్తుంటారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+