వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 ఏళ్ల రికార్డ్ బ్రేక్: గుర్గావ్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు, ఢిల్లీలో అత్యధిక వేడి ఏప్రిల్ ఇదే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాలలో తీవ్రమైన వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్నందున.. వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలో రాబోయే ఐదు రోజుల్లో వేసవి తీవ్రత పెరుగుతుందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ(IMD) గురువారం మరో హెచ్చరిక జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది, వాయువ్య ప్రాంతంలో మరో రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది.

గురువారం, గురుగ్రామ్‌లో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవడంతో, హర్యానా, పంజాబ్‌లో ఉక్కపోత వాతావరణం నెలకొంది. అదనంగా, ఢిల్లీ, హర్యానా, యూపీ, ఒడిశా వంటి రాష్ట్రాలకు వడగాలుల హెచ్చరికను ప్రకటించారు.

 Gurugram Roasts At 45 Degrees, Delhi Sees Warmest April Day In 12 Years.

12 ఏళ్లలో ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు
43.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో ఢిల్లీలో గురువారం తీవ్రమైన హీట్‌వేవ్‌ను చూసింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మెర్క్యూరీ 46 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది, ఇది రాజధానిలో అత్యంత వెచ్చని ప్రదేశంగా మారింది. శుక్రవారం తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని నగరవాసులను హెచ్చరిస్తూ IMD 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది.

రిడ్జ్ (45.1 డిగ్రీల సెల్సియస్), ముంగేష్‌పూర్ (45.8 డిగ్రీల సెల్సియస్), నజఫ్‌గఢ్ (45.4 డిగ్రీల సెల్సియస్), పితంపురా (45.2 డిగ్రీల సెల్సియస్) గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే కనీసం ఐదు డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైంది.

జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.1 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంది, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఉష్ణోగరత 45.6 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది.

ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40, 43 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. గురుగ్రామ్ హర్యానాలో అత్యంత వేడిగా ఉన్న ప్రదేశం, ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 42.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

ఇదిలా ఉండగా, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని వాతావరణ నిపుణులు కూడా చెప్పారు.

చురు, బార్మర్, బికనీర్, శ్రీ గంగానగర్ వంటి ప్రదేశాలలో గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సాధారణం, అయితే ఏప్రిల్ చివరి నాటికి ఉత్తర భారతదేశంలోని మైదానాలలో 45-46 డిగ్రీల సెల్సియస్ చాలా అసాధారణంగా ఉందని స్వతంత్ర వాతావరణ నిపుణుడు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.

ఐఎండీ కూడా మే 2 నుంచి వాయువ్య భారతదేశంలో తేలికపాటి లేదా మోస్తరు వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది. అప్పటి వరకు, రాబోయే రెండు రోజుల్లో వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సుమారు రెండు డిగ్రీలు పెరుగుతుంది.

ఇటువంటి తీవ్రమైన వేడి తరంగాలు శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులతో సహా హాని కలిగించే వ్యక్తులకు మితమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది.

ప్రజలు వేడికి గురికాకుండా ఉండాలని, హైడ్రేటెడ్‌గా ఉండాలని సూచించింది. ప్రజలు తేలికపాటి, లేత రంగుల కాటన్ దుస్తులను ధరించాలని, టోపీ, గొడుగు మొదలైనవాటితో తలపై కప్పుకోవాలని సూచించింది.

English summary
Gurugram Roasts At 45 Degrees, Delhi Sees Warmest April Day In 12 Years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X