మూడురోజులే బిజెపిలో, స్వంతగూటికి చేరిన మాజీ మంత్రి
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కుమార్తె గురుకన్వాల్ కౌర్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మూడు రోజుల క్రితం ఆమె కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరారు.
పంజాబ్ :రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి గురుకన్వాల్ కౌైర్ తిరిగి స్వంత గూటికి చేరుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు న్యాయం జరగలేదని ప్రకటించిన మూడు రోజులకే ప్లేట్ పిరాయించిందామె. చిన్న పొరపాటు కారణంగానే పార్టీని వీడాల్సి వచ్చిందని ఆమె ప్రకటించారు.
ఎన్నికల సమయంలో జంప్ జిలానీలను తరచూ చూస్తుంటాం. అయితే పంజాబ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కుమార్తె కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. ఆమె కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు.
కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీశామని బిజెపి సంతోషం ఎంతోకాలం నిలువలేదు. బిజెపిలో చేరిన మూడురోజులకే ఆమె ఆ పార్టీ కి గుడ్ బై చెప్పారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బిజెపిలో చేరేసమయంలో కాంగ్రెస్ పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు.అయితే చిన్న పొరపాటు కారణంగానే తాను కాంగ్రెస్ నువీడాల్సి వచ్చిందని గురు కన్వాల్ కౌర్ ప్రకటించారు.

బిజెపికి షాకిచ్చిన గురు కన్వాల్ కౌర్
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కుమార్తై గురు కన్వాల్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో కేంద్రఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరారు. తనను తనకుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకొందని ఆమె విమర్శలు గుప్పించారు. బిజెపిలో చేరిన మూడురోజులకే ఆ పార్టీ గుడ్ బై చెప్పారు. చిన్న పొరపాటు కారణంగానే తానే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని ఆమె ప్రకటించారు.

కాంగ్రెస్ లో ఉత్సాహం
పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల వేళ పార్టీకి దూరమైన నాయకులు తిరిగి రావడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉత్సాహన్ని నింపుతున్నాయి. మాజీ క్రికెటర్ సిద్దూ కూడ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దూ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బిజెపి నాయకులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు అందరినీ కలుపుకొని వెళ్ళేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే బిజెపిలో చేరిన గురుకన్వాల్ తో పిసిసి అధ్యక్షుడు అమరీందర్ సింగ్ చర్చలు జరిపాడు. ఈ చర్చలు ఫలవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం నింపింది.

అధికారం కోసం కాంగ్రెస్ సర్వశక్తులు
పంజాబ్ రాష్ట్రంలో ఈ దఫా ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకొనేందుకుగాను కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డుతోంది. ఈ మేరకు తమ పార్టీకి మద్దతిచ్చేవారిని ఎవరినీ కూడ వదులుకోవడానికి ఆ పార్టీ సిద్దంగా లేదు. తమకు అనుకూలంగా ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు సిద్దూ చేరికలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కీలకంగా వ్యవహరించాడు. సిద్దూను ఒప్పిండంలో రాహుల్ కీలకపాత్ర పోషించాడని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

గురుకన్వాల్ కు మంచి పట్టుంది
మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ కుమార్తై గురుకన్వాల్ కౌర్ కు మంచి పట్టుంది. బియాంత్ సింగ్ కుమార్తె గానే కాకుండా స్వతహగా ఆమెకు మంచి పట్టుందని కాంగ్రెస్ భావిస్తోంది. బియాంత్ సింగ్ కుమార్తె బిజెపిలో చేరడం కాంగ్రెస్ పై తీవ్రమైన ప్రభావం చూపే అంశంగా ఆ పార్టీ భావించింది. దీన్ని సీరియస్ గా తీసుకొన్న రాష్ట్ర నాయకత్వం తిరిగి ఆమెను స్వంత పార్టీలోకి రప్పించడంలో కీలకంగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications