ఛీ.. ఛీ.. ఏంటీ పని..? కేరళ గురువాయూర్ ఆలయంలో శుద్ధి ప్రారంభం..

భారతదేశంలో ప్రాచీనమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కేరళ రాష్ట్రంలోని గురువాయూర్​ ఆలయం ఒకటి. ఈ ఆలయానికి 5 వేల ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. నిత్యం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. అయితే ఈ ఆలయం తాజాగా వార్తల్లో నిలిచింది. పవిత్రమైన ఈ ఆలయంలో సోషల్ మీడియా పాపులారిటీ కోసం ఓ యువతి చేసిన వికృత చేష్టలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ లు తమ లైక్స్, సబ్ స్క్రైబర్ల కోసం వేల ఏళ్ల విశిష్టత కలిగిన ఆలయాల పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కేరళలోని గురువాయూర్​ ఆలయంలో జరిగిన నేపథ్యంలో ఆలయ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ అధికారులు శుద్ధి ప్రారంభించారు.

సోషల్ మీడియా పెరిగిపోయిన నేపథ్యంలో పాపులారిటీ కోసం ఇప్పుడు కొత్తగా పురాతన ఆలయాలను ఎంచుకుంటున్నారు. ఈ వరుస ఘటనలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. తాజాగా కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ఓ ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన పని దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఇన్‌ స్టాగ్రామ్ రీల్స్ కోసం ఆమె పవిత్ర ఆలయ కోనేటిలో కాళ్లు పెట్టింది. రీల్స్ చేసింది. దీంతో ఆలయ అధికారులు ఆరు రోజుల పాటు ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, మలయాళం బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ జాస్మిన్‌ జాఫర్‌.. వారం కిందట గురువాయూర్‌ ఆలయానికి వెళ్లింది. ఆ సమయంలో కోనేరులో కాళ్లు కడుగుతూ.. ఆ ప్రాంగణమంతా కలియతిరిగింది. అంతేకాక ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో తీవ్ర దుమారం రేగింది. దీంతో ఆమె చర్యలపై భక్తులు, పలు హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆలయ సంప్రదాయాలను ఉల్లంఘించి, మతపరమైన మనోభావాలను కించపరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Guruvayur Temple Ordered to Undergo Purification After Jasmine Jafar s Reel Controversy

ఒక హిందూయేతర మహిళ.. అదికూడా ఆలయ పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరించిందంటూ ఇటు ఆలయ నిర్వాహకులు సైతం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఆలయ శుద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. శుద్ధి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దైవ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేశారు. శుద్ధి పూజలన్నీ పూర్తయ్యాకే నలంబలంలో(గురువాయూర్‌ సమీపంలోని నాలుగు ఆలయాలు) ప్రవేశానికి అనుమతిస్తామని.. ఇందుకు భక్తులు సహకరించాలని దేవస్థానం బోర్డు విజ్ఞప్తిచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+