ఐటం సాంగ్‌కు డ్యాన్స్: హైకోర్టు జడ్జిపై లేడీ జడ్జీ ఫిర్యాదు

న్యూఢిల్లీ: ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. తనను హైకోర్టు న్యాయమూర్తి లైంగికంగా వేధిస్తున్నారంటూ గ్వాలియర్‌లో అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఓ మహిళా న్యాయమూర్తి ఫిర్యాదు చేశారు. ఓ ఐటెం సాంగ్‌కు తనను డ్యాన్స్ చేయాలని చెప్పాడని ఆమె ఆరోపించారు.

తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తాను తన పదవికి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. ఢిల్లీ కోర్టుల్లో 15 ఏళ్ల పాటు న్యాయవాదిగా పనిచేసిన మహిళా న్యాయమూర్తి తర్వాత మధ్య ప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీస్ పరీక్ష రాసి గ్వాలియర్‌లో 2011లో పోస్టింగ్ పొందారు. శిక్షణ తర్వాత 2012 ఆఖరులో అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తిగా గ్వాలియర్‌లో నియమితులయ్యారు.

Gwalior additional judge says she was sexually harassed by HC judge, quits

2014లో ఆమె పనితీరుపై ఇచ్చిన నివేదికలో ఆమె అద్భుతంగా పనిచేస్తున్నట్లు కితాబు ఇచ్చారు. కానీ, మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి తనను ఒంటరిగా తన బంగ్లాకు రమ్మన్నారంటూ ఆమె ఆరోపించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా, న్యాయమూర్తులు హెచ్ఎల్ దత్తు, జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ అనిల్ రమేష్ దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో పాటు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఆమె ఫిర్యాదు చేశారు.

ఈ వృత్తిలో మాత్రమే మన సహోద్యోగులను సోదరసోదరీమణులుగా గౌరవించుకునే సంప్రదాయం ఇంకా నిలబడి ఉందని, ఇది దురదృష్టకరమని, తనకు అందిన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటానని లోథా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+