H3N2 influenza: వేగంగా పెరుగుతున్న హెచ్3ఎన్ 2 కేసులు..
కొవిడ్ -19 మహమ్మారి తర్వాత ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ లో హెచ్ 3 ఎన్ 2 ఇన్ఫ్లుఎంజా కేసుల పెరుగుతున్నాయి. అధిక జ్వరం, నిరంతర దగ్గు, శ్వాస సమస్యలతో ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. కాన్పూర్ లోని హాలెట్ ఆసుపత్రిలో 200 మంది రోగులు చేరారు. కాన్పూర్ అతిపెద్ద ప్రభుత్వ (హాలెట్) ఆసుపత్రికి వెలుపల కూడా భారీ సంఖ్యలో రోగులు ఉన్నారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా రోగుల సంఖ్య పెరుగుతోంది. అధిక జ్వరం, నిరంతర దగ్గు, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో సహా ఫ్లూ లాంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇన్ఫ్లుఎంజా ఎ ఉప రకం హెచ్ 3 ఎన్ 2 వ్యాపించడంతో ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. అత్యవసర వార్డు నిండిన తర్వాత హాలెట్ వద్ద ఉన్న ఆసుపత్రి అధికారులు రోగులను వేర్వేరు వార్డులకు మార్చవలసి వచ్చింది.

"రోగి శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మేము చికిత్స కోసం అరైయా నుంచి కాన్పూర్ వరకు వచ్చాము. అతనికి ఐదు నుంచి జ్వరం ఉంది. మేము అతన్ని కాన్పూర్ వద్దకు తీసుకువచ్చాము" అని రోగి బంధువు చెప్పారు. ప్రతి సంవత్సరం వాతావరణంలో మార్పు కారణంగా ఇలాంటి కేసులు వస్తాయని కాన్పూర్లోని హలాట్ హాస్పిటల్ అధికారి రిచా గిరి చెప్పారు. అయితే ఈసారి రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు.
గత 24 గంటల్లో కేవలం 23-24 మంది రోగులు మాత్రమే శ్వాసకోస సమస్యతో వచ్చారని చెప్పారు. వారికి ఆక్సిజన్ అందిస్తున్నామని తెలిపారు. కొందరు వెంటిలేటర్లపై ఉన్నారని వివరించారు. అందరికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications