బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hair cutting: ఎస్సీలకు మాత్రం హెయిర్ కటింగ్ చెయ్యం, ఏం చేస్తారో చేసుకోండి, అన్ని షాపులు బంద్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మైసూరు: షెడ్యూల్ క్యాస్ట్ (ఎస్సీలు) కులానికి చెందిన ఓవ్యక్తి బార్బర్ షాపుకు వెళ్లి మాకు హెయిర్ కటింగ్, షేవింగ్ చెయ్యాలని బార్బర్ షాపు యజమానికి చెప్పాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా దగ్గరకు వచ్చి హెయిర్ కటింగ్ చెయ్యాలి అని అడుగుతావా ?, నువ్వు ఏంది ?, నీ కులం ఏంది ? అంటూ రెచ్చిపోవడంతో చిన్న గొడవ మొదలైయ్యింది. ఇది రానురాను ముదిరిపోయింది. ఎస్సీలకు ఎవ్వరూ హెయిర్ కటింగ్, షేవింగ్ చెయ్యకూడదని ఆ ప్రాంతంలోని బార్బర్ షాపు యజమానులు డిసైడ్ కావడం, వివాదం ముదిరిపోవడంతో మొత్తం బార్బర్ షాపులు అన్ని మూసేయడం హాట్ టాపిక్ అయ్యింది.

Cheating: బెంగళూరు బ్యూటీ, చెన్నై చిన్నోడు, నా భర్త కస్టమ్స్ ఆఫీసర్ ?, రూ. 68 లక్షలు ఫట్ !Cheating: బెంగళూరు బ్యూటీ, చెన్నై చిన్నోడు, నా భర్త కస్టమ్స్ ఆఫీసర్ ?, రూ. 68 లక్షలు ఫట్ !

పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది

పచ్చగడ్డి వేస్తే భగ్గుమంది

కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటీ హబ్ కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేక ఉంది. అలాంటి మైసూరు జిల్లా సమీపంలోని మండ్య జిల్లా లోని శ్రీరంగపట్టణం తాలుకాలోని మహదేవపుర ప్రాంతంలో షెడ్యూల్ కులాల వారికి, బార్బర్ షాపు యజమానుల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది.

హెయిర్ కటింగ్ చెయ్యండి

హెయిర్ కటింగ్ చెయ్యండి

మహదేవపురలో నివాసం ఉంటున్న కొందరు షెడ్యూల్ క్యాస్ట్ (ఎస్సీలు) బార్బర్ షాపుకు వెళ్లి మాకు హెయిర్ కటింగ్, షేవింగ్ చెయ్యాలని బార్బర్ షాపు యజమానికి చెప్పాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా దగ్గరకు వచ్చి హెయిర్ కటింగ్ చెయ్యాలి అని అడుగుతావా ?, నువ్వు ఏంది ?, నీ కులం ఏంది ? అంటూ రెచ్చిపోవడంతో చిన్న గొడవ మొదలైయ్యింది.

మొత్తం బార్బర్ షాపులు బంద్

మొత్తం బార్బర్ షాపులు బంద్

హెయిర్ కటింగ్ చేసే విషయంలో నాయిబ్రహ్మాణులు, ఎస్సీల మద్య వాగ్వివాదం జరిగింది. ఈ వివాదం పెద్దది అయ్యింది. ఎస్సీలకు ఎవ్వరూ హెయిర్ కటింగ్, షేవింగ్ చెయ్యకూడదని మహదేవపుర ప్రాంతంలోని 7 బార్బర్ షాపు, పరిసర ప్రాంతాల్లో బార్బర్ షాపులు మూసేశారు. ఎస్సీలకు ఎవ్వరు హెయిర్ కటింగ్ చెయ్యకూడదని బార్బర్ షాపు యజమానులు డిసైడ్ అయ్యారు.

పక్కఊరి ఎస్సీలకు హెయిర్ కటింగ్ చేస్తున్నారు

పక్కఊరి ఎస్సీలకు హెయిర్ కటింగ్ చేస్తున్నారు

వివాదం ముదిరిపోవడంతో గ్రామపంచాయితీ సభ్యుడు మహేష్ తో పాటు కొందరు ఎస్సీలు వెళ్లి అరకెరె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. చెన్నహళ్లి, బిదరహళ్లిలోని ఎస్సీలకు ఇక్కడ హెయిర్ కటింగ్, షేవింగ్ చేస్తున్నామని, మా ఊరిలోని ఎస్సీలకు హెయిర్ కటింగ్, షేవింగ్ చెయ్యమంటే బార్బర్ షాపు యజమానులు చెయ్యడం లేదని స్థానికులు ఆరోపించారు,

రంగంలోకి దిగిన ఎస్ఐ

రంగంలోకి దిగిన ఎస్ఐ

ఈనెల 14వ తేదీన సబ్ ఇన్స్ పెక్టర్ పునీత్ స్వయంగా మహదేవపుర వెళ్లి కొన్ని బార్బర్ షాపులు తీపించి ఆ రోజు ఎస్సీ కులానికి చెందిన చాలా మందికి హెయిర్ కటింగ్ చేయించారు. మరుసటి రోజు బార్బర్ షాపులు తీసిన యజమానులు తరువాత ఒకేసారి అన్ని బార్బర్ షాపులు మూసేశారు.

మొత్తం అన్ని షాపులు మూసేశారు

మొత్తం అన్ని షాపులు మూసేశారు

ఎస్సీలకు ఎలాంటి పరిస్థితుల్లో హెయిర్ కటింగ్ చెయ్యమని ఆరోజు నుంచి ఈరోజుటి వరకు బార్బర్ షాపులు అన్ని సామూహికంగా మూసివేయడం కలకలం రేపింది. రాజకీయ నాయకులు, పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసు అధికారులు కొందరు ఎస్సీలకు హెయిర్ కటింగ్ చేయించినా ఫలితం లేదు.

రాజకీయ నాయకులు, పోలీసులు ఎంట్రీ

రాజకీయ నాయకులు, పోలీసులు ఎంట్రీ

వివాదం ముదిరిపోవడంతో ఎస్సీలకు మేము ఎలాంటి సేవలు చెయ్యము అంటూ తాలుకాలోని బార్బర్ షాపులు అన్ని మూసేయడం కలకలం రేపింది. బార్బర్ షాపు యజమానుల నిరసనతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు మండ్య, మైసురుతో పాటు పరిసర ప్రాంతాల్లో ఊర్లకు వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నారు.

English summary
Hair cutting: Denial of haircut for scheduled castes, closed all shops near Mysuru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X