వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలన అధ్యయనం... వెలుగులోకి కరోనా కొత్త లక్షణాలు... జుట్టు రాలిపోవడం కూడా..?

|
Google Oneindia TeluguNews

దగ్గు,జ్వరం,తలనొప్పి,విరేచనాలు,నీరసం,వాసన కోల్పోవడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ఇవీ ఇప్పటివరకూ మనకు తెలిసిన కరోనా లక్షణాలు. కానీ మరికొన్ని కొత్త లక్షణాలు కూడా ఈ జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి ఓ సర్వేలో జుట్టు రాలడంతో సహా గతంలో నివేదించబడని పలు దీర్ఘకాలిక కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కి చెందిన ఓ డాక్టర్,కోవిడ్ 19 సర్వైర్ గ్రూప్‌తో కలిసి ఫేస్‌బుక్ పోల్ ద్వారా ఈ సర్వేని చేపట్టారు.

వెలుగులోకి కొత్త లక్షణాలు...

వెలుగులోకి కొత్త లక్షణాలు...

మొత్తం 1500 కరోనా పేషెంట్లపై ఈ సర్వే చేపట్టగా.... 98 రకాల కరోనా లక్షణాలను గుర్తించినట్లు ఇండియానా స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కి చెందిన అసోసియేట్ రీసెర్చ్ ప్రొఫెసర్ డా.నటాలీ లాంబర్ట్ తెలిపారు. 'మా అధ్యయనంలో పలు కొత్త లక్షణాలను కూడా గుర్తించాం. వాటిల్లో తీవ్రమైన నరాల నొప్పి,ఏకాగ్రత సమస్యలు,నిద్రకు సంబంధించిన సమస్యలు,చూపు మందగించడం,జుట్టు రాలడం' వంటి వాటిని గుర్తించినట్లు చెప్పారు. కొత్తగా గుర్తించిన లక్షణాల్లో 26.5శాతం లక్షణాలు నొప్పితో కూడుకున్నవని, మిగతావన్నీ నొప్పిలేనివే అని చెప్పారు. నొప్పి లేని సమస్యల్లో మూడో వంతు పేషెంట్లు జుట్టు రాలిపోవడం గురించి కూడా రిపోర్ట్ చేసినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు.

75శాతం జుట్టు కోల్పోయిన ఓ పేషెంట్....

75శాతం జుట్టు కోల్పోయిన ఓ పేషెంట్....

సర్వేలో పాల్గొన్న కరోనా పేషెంట్ ఒకరు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఏప్రిల్‌లో తాను కోవిడ్ 19 బారిన పడ్డానని,అప్పటినుంచి ఇప్పటివరకూ 75శాతం జుట్టును కోల్పోయానని చెప్పారు. తనకు జుట్టు తిరిగి వస్తుందో లేదో ఇప్పుడు తాను కచ్చితంగా చెప్పలేనని అన్నారు. తాను విగ్ ధరించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. 'వైరస్ బారిన పడ్డప్పటి నుంచి నా ముఖం నా వయసు కంటే ముదిరిపోయినట్లుగా కనిపిస్తోంది.' అని తెలిపారు.

డెర్మటాలజీ నిపుణులు ఏమంటున్నారు...

డెర్మటాలజీ నిపుణులు ఏమంటున్నారు...

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ చర్మంపై కరోనా వైరస్ ప్రభావాన్ని విశ్లేషిస్తోంది. వైరస్ ఉన్న వ్యక్తుల శరీరంపై లేదా కాలి వేళ్లపై దద్దుర్లు వస్తున్నట్లుగా ఇప్పటికే ఆ అకాడమీ హెచ్చరించింది. అదే అకాడమీకి చెందిన డా.ఈస్తర్ ఫ్రీమ్యాన్ మాట్లాడుతూ... పేషెంట్లలో జుట్టు రాలిపోతున్న సమస్య కూడా తీవ్రమవుతోందని వెల్లడించింది. తాజా అధ్యయనానికి సంబంధించిన రిపోర్టులో ఈ పరిస్థితికి కారణం జుట్టు రాలడాన్ని 'టెలోజెన్ ఎఫ్లూవియం' అని పేర్కొనడం గమనార్హం.

టెలోజెన్ ఎఫ్లూవియం కారణంగానే...

టెలోజెన్ ఎఫ్లూవియం కారణంగానే...

ఎవరైతే ఒత్తిడితో కూడిన అనారోగ్యంతో బాధపడుతున్నారో లేదా ఇతరత్రా కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో... వారిలో టెలోజెన్ ఎఫ్లూవియం' కారణంగా జుట్టు రాలే సమస్య తలెత్తుందని అధ్యయనంలో పేర్కొన్నారు. అయితే మనిషిని ఒత్తిడికి గురిచేసే సంఘటన జరిగిన మూడు నెలల తర్వాత 'టెలోజెన్ ఎఫ్లూవియం' వల్ల జుట్టు రాలడం మొదలవుతుందని డా.ఫ్రీమ్యాన్ పేర్కొన్నారు. నిజానికి ఫేస్‌బుక్ సర్వేను మెడికల్ అధ్యయనానికి ఒక ప్రాతిపదికగా తీసుకోవడం మునుపెన్నడూ జరగలేదు. అయితే సర్వైవర్ కార్ప్స్ గ్రూప్ అనుభవాలు కరోనా లక్షణాలను గుర్తించడంలో కీలకంగా పనిచేస్తాయని డా.నటాలీ లాంబర్ట్ తెలిపారు.

Recommended Video

Telangana లో కరోనా ఉప్పెన, 2013 మందికి పాజిటివ్ | Telangana Corona Update || Oneindia Telugu
ఇప్పటివరకూ 17 లక్షణాలు...

ఇప్పటివరకూ 17 లక్షణాలు...

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇప్పటివరకూ 17 రకాల కరోనా లక్షణాలను గుర్తించిన సంగతి తెలిసిందే. తాజా అధ్యయనంలో మరిన్ని కొత్త లక్షణాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. 'ఈ దీర్ఘకాలిక లక్షణాలకు అసలు కారణాలను పరిశోధించడం,దానికి సంబంధించి చికిత్స విధానాన్ని కనిపెట్టేదాకా చాలామంది కోవిడ్ 19 పేషెంట్లు సమస్యలతో సతమతమవుతుూనే ఉంటారు.' అని డా.లాంబర్ట్ పేర్కొన్నారు.

English summary
A recent survey identified dozens of potential long-term coronavirus symptoms that had previously been unreported, including hair loss.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X