Hanuman Garhi:ఈ ఆలయాన్ని దర్శించకపోతే అయోధ్య సందర్శన అసంపూర్తే..!
Hanuman Garhi Temple: 2024 జనవరి 22 భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. అయోధ్య రామమందిరం ప్రారంభమైన రోజు. ఇక యావత్ ప్రపంచం దృష్టి ఈ మహావేడుకపైనే ఉంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా అత్యంత దగ్గరగా ఈ వేడుకను వీక్షిస్తున్నాయి. ఇక అయోధ్య రామమందిరంకు ఎంతటి ప్రాధాన్యత ఉందో... ఈ ఆలయ పరిసరాల్లో ఉన్న పలు ఆలయాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అందులో ఒకటి హనుమాన్ గర్హి.హనుమాన్ గర్హి ఆలయ చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
ఈ ఆలయాన్ని నిర్మించింది నవాబులు. ఇదే అన్నిటికంటే ముందుగా ఆసక్తికరమైన అంశం. హనుమాన్ గర్హి ఆలయ నిర్మాణంలో అప్పటి నవాబ్ సాహెబ్ కీలక పాత్ర పోషించారు.ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారు. రాముడితో పాటు హనుమంతుడిని దర్శించుకోకుండా అయోధ్య సందర్శన పూర్తికాదని స్థానికులు లేదా ఇక్కడికి వచ్చే భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

చరిత్ర పుటలను తిరిగేస్తే హనుమాన్ గర్హి ఆలయం గురించి రెండు భిన్నమైన విషయాలు తెలుస్తాయి. ఫైజాబాద్‌లోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ మహేష్ చంద్ర చేసిన పరిశోధన ఆధారంగా హనుమాన్‌గర్హి ఆలయ చరిత్ర ఇలా వివరించబడింది:
విక్రమాదిత్య మహారాజ్ మొదట ఈ ఆలయాన్ని నిర్మించాడు: అయోధ్యలో హనుమంతునికి అంకితం చేయబడిన మొదటి ఆలయాన్ని విక్రమాదిత్య నిర్మించారు. అయితే ఈ పురాతన ఆలయం ధ్వంసంకావడంతో ప్రజలు ఈ స్థలాన్ని హనుమాన్ తిలా అని పిలవడం ప్రారంభించారు.లక్నోను నవాబ్ మసూర్ అలీఖాన్ సఫ్దర్ జంగ్ సాహెబ్ పాలిస్తున్నప్పుడు ఈ స్థలంలో బాబా అభయ్ రాందాస్ జీ త్యాగి అనే మహాత్ముడు ఒక గుడిసెను నిర్మించుకుని నివసించేవాడని చరిత్ర చెబుతోంది.అతను చాలా నిష్ణాతుడైన సాధువు అని అందులో ఉంది.అంతేకాదు బాబా అభయ్ రాందాస్‌కు హనుమంతుడు దర్శనం కూడా ఇచ్చారని చరిత్ర చదివితే తెలుస్తోంది.

హనుమంతుని ఆలయంలో అద్భుతం: చరిత్ర చెబుతున్న ప్రకారం 17వ శతాబ్దంలో నవాబ్ మసూర్ అలీ సాహెబ్ తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు అతనికి పేరుగాంచిన వైద్యులు చికిత్స అందించారు.కానీ అతని ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు.ఇక ఎంతో మంది ముస్లిం ఫకీర్లు నవాబ్ ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు నిర్వహించారు, తాయెత్తులు కూడా కట్టారు. అయితే ఫలితం దక్కలేదు.
నవాబ్ సాహెబ్ అనారోగ్యం గురించి మహారాజ్ తికైత్ రాయ్ మన్సూర్ ఖాన్ ఆరా తీశారు.వెంటనే అతను మహాత్మా అభయ్ రాంజీని అక్కడికి పంపాడు.మహాత్మ అభయ్ రాం వైద్య పరిజ్ఞానం ఉన్న సాధువు.అంతేకాదు అయోధ్యలో పూజలు నిర్వహించే పూజారి కూడా.ఇక నవాబ్ సాహెబ్‌ను చూసి అభయ్ రాంజీ హనుమాన్ పేరిట చేసిన పూజ చేసిన పవిత్ర జలాన్ని ఔషధంగా ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఆ ఔషధం పనిచేసి త్వరగా ప్రభావం చూపడంతో నవాబ్ సాహెబ్ అనారోగ్యం నుంచి కోలుకున్నాడట.
ఈ ఆలయం నుంచి సేకరించిన పవిత్ర జలం తనను తిరిగి మామూలు మనిషి చేయడంతో వెంటనే హనుమాన్ తిల మీద హనుమాన్ ఆలయాన్ని నవాబ్ సాహెబ్ నిర్మించాడని చరిత్ర చెబుతోంది.దీన్నే ఈరోజు హనుమాన్ గర్హి అని పిలుస్తున్నారు. మహారాజ్ తికైతరాయ్ నేతృత్వంలో ఈ ఆలయం నిర్మించబడింది. హనుమాన్ గర్హికి నాలుగు ఫలకాలున్నాయి. హర్ద్వారి, బసతియా, ఉజ్జయినియా, తికాయత్‌నగర్ మరియు సాగరియా.హనుమాన్ గర్హిలో దాదాపు 5వేల మంది సాధువులు నివసిస్తున్నారు. ప్రతి ఏకాదశి రోజున ఆలయం ద్వారా వచ్చిన ఆదాయంతో ఆహారం, ఫలాలతో పాటు ఒక్కొక్కరికి రెండు రూపాయలు ఇచ్చేవారు.

హనుమాన్ గర్హి కోసం భీకర యుద్ధం: హనుమాన్ గర్హి కోసం ఓ యుద్ధం జరిగిందనేది ప్రచారంలో ఉంది. రామజన్మభూమిలో బాబర్ మసీదును నిర్మించారని 1822లో ఫైజాబాద్ న్యాయాధికారి హఫీజుల్లా వ్యాఖ్యానించాడు.మసీదు సీతా రసోయ్‌కు సమీపంలో ఉందని చెప్పారట.హనుమాన్ గర్హి కోసం 33 ఏళ్ల తర్వాత అంటే 1855లో భీకర యుద్ధం జరిగింది.హనుమాన్ గర్హిపై దాడులు చేసేందుకు జీహాదీలు యత్నిస్తున్నారని దీన్ని ఆపాలంటూ బ్రిటీష్ రెసిడెంట్ అప్పటి అవధ్ నవాబ్‌కు లేఖ రాశారు.
రామ జన్మభూమిపై దాడి చేయాలంటూ ముస్లింలను సున్ని మాల్వీ గులాం హుస్సేన్ రెచ్చగొడుతున్నారంటూ బ్రిటీష్ రెసిడెంట్ ఆ లేఖలో పేర్కొన్నారు.హనుమాన్ గర్హిలో మసీదు ఉందనేది గులాం హుస్సేన్ వాదన.ఇక బ్రిటీష్ రెసిడెంట్ రాసిన లేఖపై స్పందించలేదు అప్పటి నవాబ్. తొలుత చిన్నపాటి దాడులే జరిగినప్పటికీ ఆ తర్వాత అక్కడ రక్తపాతమే జరిగింది.గులాం హుస్సేన్ తన సైన్యంతో హనుమాన్ గర్హిపై దాడి చేశాడు. దీంతో హిందూ సాధువులు ధీటైన సమాధానం ఇచ్చారు. ఈ పరస్పర దాడిలో గులాం హుస్సేన్‌తో పాటు మరో 70 మంది అతని అనుచరులు మరణించినట్లు చరిత్ర చెబుతోంది.












Click it and Unblock the Notifications