Father's Day Quotes 2021: గుండెలపై తన్నినా గుండె నిండా ప్రేమ నింపుకునే గొప్ప వ్యక్తిత్వం నాన్నది
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సూపర్ హీరో ఉంటాడు.. ముఖ్యంగా పిల్లల జీవితంలో సూపర్ హీరో మాత్రం ఎప్పుడూ నాన్నే . నాన్నంటే ఓ నమ్మకం, ఓ ధైర్యం. నాన్న మన వెనుక ఉన్నాడు అంటే భయం అనేది మర్చిపోతాం. బుడిబుడి అడుగులు వేసే నాటినుండి ప్రతిరోజు నాన్నను గమనిస్తూ ఆయనను అనుసరిస్తాం,అనుకరిస్తాం,ఆదర్శంగా తీసుకుంటాం.
మన తప్పటడుగులను, తప్పుటడుగులను దిద్ది మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దటం కోసం నాన్న పడే శ్రమ అంతా ఇంతా కాదు. మాతృదేవోభవ.. పితృదేవోభవ .. ఆచార్యదేవోభవ అంటారు. తల్లి తర్వాత మనం నిజంగా పూజించాల్సింది నాన్ననే . అలాంటి నాన్నలందరికీ ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వన్ఇండియా ఫాదర్స్ డే కు సంబంధించి కొన్ని కొటేషన్స్ అందిస్తోంది.

సహనానికి మారుపేరు నాన్న, మార్పుకు మార్గదర్శి నాన్న
మనం ప్రేమించినా , ద్వేషించినా తిరిగి మనల్ని ప్రేమించే గలిగేది ఒక్క నాన్న మాత్రమే
గుండె నిండా ప్రేమ ఉన్నా పైకి వ్యక్తం చెయ్యని నిగూఢ వ్యక్తి నాన్న
మనం గెలిచినప్పుడు పదిమందికి సంతోషంగా చెప్పి, మనం ఓడిపోతే మళ్లీ గెలుస్తావులే అని వెన్నుతట్టి ప్రోత్సహించే స్ఫూర్తి ప్రదాత నాన్న
నీ జన్మకు కారణం నాన్న.. నీ భవితకు మార్గాన్ని చూపించేది కూడా నాన్నే
గుండెలపై తన్నినా గుండె నిండా ప్రేమ నింపుకునే గొప్ప వ్యక్తిత్వం నాన్నది
నాన్న ప్రేమకు రూపం ఉండదు... భావం తప్ప
కొడుకు ప్రయోజకుడైతే మొదట సంతోష పడేది నాన్నే
ఏ అమ్మాయి తన భర్తకు రాణి అవ్వలేదేమో కానీ ప్రతి కూతురు తన తండ్రికి యువరాణే
పిల్లల ఇష్టాలను తీర్చడానికి, తన ఇష్టాలను త్యాగం చేసే నాన్నకు ఏమివ్వగలం... గుప్పెడంత ప్రేమ తప్ప, వృద్ధాప్యంలో ఆయనకు బాసటగా ఉండటం తప్ప. అందుకే జీవితంలో మొదటి హీరో అయిన నాన్నను ఎవర్ గ్రీన్ హీరో గానే ఎప్పటికీ చూద్దాం. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆదర్శాలతో మంచి పేరు తెచ్చుకుందాం .












Click it and Unblock the Notifications