జయలలిత ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన జర్నలిస్ట్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆరోగ్యం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి పైన అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమ్మ ఆరోగ్యంపై వదంతులకు తెరదించుతూ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు వరుస ట్వీట్లు చేశారు.

కోలుకుంటున్న జయలలిత
జయలలిత కోలుకుంటున్నారని, ఆమెకు ప్రాణాపాయం తప్పిందని మాలిని పార్థసారథి ట్వీట్ చేశారు. జయలలితను ఆసుపత్రిలో పరామర్శించిన అత్యంత సన్నిహితులు ద్వారా ఈ శుభవార్తను తాను వెల్లడిస్తున్నట్లు చెప్పారు. జయలలిత కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని, ఆమె వ్యక్తిగత నేస్తం ద్వారా తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. జయ స్పృహలోనే ఉన్నారన్నారు.

కొనసాగుతున్న చికిత్స
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. లండన్ వైద్యుడు రిచర్డ్ బెలే నేతృత్వంలో సోమవారం జయలలితకు ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన యాంటీ బయోటిక్స్ ఇచ్చారని తెలుస్తోంది.

కలిసిన శశికళ
జయను పరామర్శించేందుకు ఆమె సన్నిహితురాలు శశికళ, పన్నీర్ సెల్వం ఇతర మంత్రులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అయితే శశికళ, మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులను మాత్రమే జయలలితను చూసేందుకు అనుమతించారని తెలుస్తోంది.

కోలుకుంటున్నారు
జయలలిత క్రమంగా కోలుకుంటున్నారని అపోలో వైద్యులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు అపోలో ఆసుపత్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయలలిత ఆరోగ్యం మెరుగవుతోందని అన్నాడీఎంకే అధికార ప్రతినిది సరస్వతి సోమవారం చెప్పారు.












Click it and Unblock the Notifications