పటేల్ వర్గ నాయకుడు హార్దిక్ పటేల్‌కు బెయిల్
ఎమ్మెల్యేపై దాడి కేసులో పటేల్ వర్గ నాయకుడు హర్దిర్ పటేల్‌కు గురువారం బెయిల్ మంజూరైంది. రూ.5 వేల పూచికత్తుపై విసనగర్ కోర్టు బెయిల్ ఇచ్చింది.
అహ్మదాబాద్: ఎమ్మెల్యేపై దాడి కేసులో పటేల్ వర్గ నాయకుడు హర్దిర్ పటేల్‌కు గురువారం బెయిల్ మంజూరైంది. రూ.5 వేల పూచికత్తుపై విసనగర్ కోర్టు బెయిల్ ఇచ్చింది.
హార్దిక్ పటేల్‌పై బుధవారం అరెస్టు వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. 2016లో విసనగర్‌లోని మెహసనా ప్రాంతంలో బిజెపి ఎమ్మెల్యే రిషికేశ్ పటేల్ కారుపై దాడి జరిగింది.

ఈ దాడికి పాల్పడింది పాటిదార్ ఆందోళన నాయకులేనంటూ ఎమ్మెల్యే కేసు పెట్టారు. ఈ కేసులో హార్దిక్, లాల్ జీ పటేల్‌లతో పాటు పలువురికి అరెస్టు వారెంట్ జారీ చేశారు. దీంతో నేడు హర్దిక్ కోర్టులో హాజరయ్యారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications