మోడీ! సీప్లేన్‌తో రైతులు పెస్టిసైడ్స్ చల్లుకోవచ్చా?: హార్దిక్ సెటైర్లు
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ప్రధాని నరేంద్ర మోడీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. తాజగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సీప్లేన్‌లో ప్రయాణించిన విషయం తెలిసిందే.
ఈ అంశంపై కూడా హార్దిక్ పటేల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీప్లేన్ వల్ల రైతులకు ఒరిగేది ఏముందని ప్రశ్నించారు. అంతేగాక, ఈ సీప్లేన్.. రైతులు పురుగుల మందుల జల్లుకోవడానికి ఉపయోగపడుతుందా? అంటూ హార్దిక్ పటేల్ ఎద్దేవా చేశారు.
sea plane दूसरे देशों में बहुत समय से हैं।आज हमारे गुजरात में आया हैं काफ़ी ख़ुश हूँ।लेकिन चुनाव के अगले दिन ही आया वो बढ़िया बात हैं।किसान किट नाशक दवाई भी Plane से डाल सके एसा कुछ कीजिए
— Hardik Patel (@HardikPatel_) December 12, 2017
అనేక దేశాల్లో సీప్లేన్ సర్వసాధారణమైన విషయమనీ... ఇప్పుడు అవి గుజరాత్ వస్తే సంతోషమేనని వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల ముందే ఈ విమానాలు రావడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అంతేగాక, బీజేపీ ప్రభుత్వం అహంకారంతో మిడిసిపడుతోందంటూ ట్విట్టర్ వేదిక హార్దిక్ తీవ్రస్థాయిలో స్పందించారు.
विकास तो लंका में भी हुवा था लंका पूरी सोने की थी,लेकिन अहंकार और घमंड की वजह से पूरी लंका जल गई थी !!! pic.twitter.com/lVnhrEEUjJ
— Hardik Patel (@HardikPatel_) December 12, 2017
మంగళవారం ఉదయం ట్విటర్లో స్పందిస్తూ.. 'లంక కూడా అభివృద్ధి చెందింది. బంగారం, సంపదతో తులతూగింది. అయితే రావణుడి అహంకారం వల్ల రాజ్యం మొత్తం బూడిదైంది...' అని హార్దిక్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications