వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి 22 ఏళ్ల యువకుడి సవాల్ (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్ లో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుని భారత ప్రధాని అయిన నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులకు ఒక యువకుడు తలనోప్పిగా తయారైనాడు. అతని పేరు చెబితేనే బీజేపీ నాయకులు హడలిపోతున్నారు.

మూడు నెలల క్రితం హార్దిక్ పటేల్ (22) అంటే అతను ఉంటున్న ఊరివారికి, బంధువులకు మాత్రం తెలుసు. ఇప్పుడు గుజరాత్ లో కోన్ని కోట్ల మందికి హార్డిక్ పటేల్ అంటే తెలుసు. పటేల్ సామాజిక వర్గంలో అతను తిరుగులేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

హార్ధిక్ పటేల్ పిలుపునిస్తే లక్షల మంది మీటింగ్ లకు తరలివస్తున్నారు. అహ్మదాబాద్ సమీపంలోని వీరంగామ్ కు చెందిన హార్దిక్ పటేల్ బీకాం పూర్తి చేశాడు. గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని పోరాటం చేస్తున్నాడు. గుజరాత్ ను గడగడలాడిస్తున్నాడు.

ప్రభంజనం

ప్రభంజనం

హార్దిక్ తండ్రి చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. హార్దిక్ పటేల్ గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాడు.

పీఏఏఎస్ కన్వీనర్

పీఏఏఎస్ కన్వీనర్

పటేల్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) కన్వీనర్ గా ఉన్న హార్దిక్ పటేల్ తాను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకం కాదని అంటున్నాడు. తమకు (పటేల్) రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు.

బల్లెం అయ్యాడు

బల్లెం అయ్యాడు

గుజరాత్ లో సాఫీగా సాగిపోతున్న బీజేపీ ప్రభుత్వానికి హార్దిక్ బల్లెం అయ్యాడు. బీజేపీ నేతలకు నిద్రలేకుండా చేస్తున్నాడు. ఇతని మీటింగ్ లకు లక్షల మంది పటేల్ సామాజిక వర్గం వారు హాజరౌతున్నారు.

2017 ఎన్నికలు

2017 ఎన్నికలు

మాకు రిజర్వేషన్లు కల్పించకపోతే 2017 లో జరిగే శాసన సభ ఎన్నికలలో బీజేపీని ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గానికి 15 శాతం ఓట్లు ఉన్నాయి.

రాజీ లేదు....... సవాల్

రాజీ లేదు....... సవాల్

తాము ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడబోమని హార్దిక్ పటేల్ తేల్చి చెప్పాడు. ఇతనికి రాజకీయ అండ లేదు, శ్రీమంతుడు కాదు, కేవలం వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకుంటున్నాడు.

సీఎంకు తల నోప్పి

సీఎంకు తల నోప్పి

గుజరాత్ సీఎం ఆనందీ బెన్ పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారే. ఆమెకు ఇప్పుడు ఈ సమస్య తలనోప్పిగా తయారైయ్యింది. ఇప్పటికే గుజరాత్ లో రిజర్వేషన్లు 50 శాతం దాటిపోయాయి.

మోదీకి పెద్ద సమస్య

మోదీకి పెద్ద సమస్య

గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గానికి న్యాయం చెయ్యకపోతే ప్రధాని నరేంద్ర మోదీకి తలనోప్పి తప్పదు. వచ్చే శాసన సభ ఎన్నికలలో సోంత గడ్డ మీద మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.

English summary
Who is Hardik Patel, who has shaken Gujarat CM Anandiben Patel-led BJP govt?. 22-year-old Hardik Patel has emerged as a beacon of hope for the youth of Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X