గుజరాత్ ఎన్నికలు, హార్దిక్ పటేల్ కు బంపర్ ఆఫర్: బీజేపీ ఇంటికే, వాజ్ పెయ్ బీజేపీ వేరు!

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరత్‌ లో చేపట్టిన ర్యాలీలో పాల్గొనకుంటే తనకు రూ. ఐదు కోట్లు ఇస్తానని ఓ వ్యాపారవేత్త ఆఫర్‌ చేశారని పాటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. సూరత్ లో జరిగిన ర్యాలీలో కొన్ని లక్షల మంది పాల్లొన్నారని హార్దిక్ పటేల్ వివరించారు.

పాటీదార్‌ కులస్తులు అందరూ కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతున్నారని హార్దిక్ పటేల్ చెప్పారు. పాటీదార్‌ వర్గం ఈ సారి బీజేపీకి ఓటువేయడం లేదని హార్దీక్ పటేల్ అన్నారు. అంతేకాకుండా ఎన్సీపీ, ఆప్ తో సహ స్వతంత్ర్య అభ్యర్థుల ఉచ్చులో పడకూదని హార్దిక్ పేటల్ పాటీదార్లకు మనవి చేశారు.

 కోట్ల మంది పాటీదార్లు!

కోట్ల మంది పాటీదార్లు!

సూరత్ ర్యాలీలో ప్రసంగించిన హార్ధిక్‌ పటేల్ బీజేపీకి ఓట్లు వేయవద్దని మీ బంధువులు అందరికీ పోన్లు చేసి చెప్పాలని మనవి చేశారు. పాటీదార్ల ఆందోళనను పట్టించుకోని గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వానికి ఆరు కోట్ల పాటీదార్‌ వర్గ ప్రజలు తగిన బుద్ది చెప్పాలని హార్దిక్ పటేల్ సూచించారు.

19వ తేదీ మీడియాలో మీరే చూస్తారు

19వ తేదీ మీడియాలో మీరే చూస్తారు

బీజేపీకి పాటీదార్లు దూరం అయితే ఎలా ఉంటుందో డిసెంబర్ 19వ తేదీ మీడియాలో అందరూ చూస్తారని, ఆరోజు ప్రధాని నరేంద్ర మోడీకి దిమ్మతిరిగిపోతుందని హార్దిక్ పటేల్ జోస్యం చెప్పారు. పాటీదార్లు ఎవ్వరూ బీజేపీకి ఓటు వెయ్యకూడదని హార్దిక్ పటేల్ మనవి చేశారు.

వాజ్ పెయ్ బీజేపీ వేరు

వాజ్ పెయ్ బీజేపీ వేరు

రైతులు, పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన వాజ్‌ నేతృత్వంలోని పెయ్‌ బీజేపీ వేరని, ప్రస్తుతం అమిత్ షా నేతృత్వంలో ఉన్న బీజేపీ వేరని హార్దిక్ పటేల్ అన్నారు. ప్రస్తుతం అమిత్ షా నేతృత్వంలో ఉన్న బీజేపీలో అందరూ అవివేకులే ఉన్నారని హార్దిక్ పటేల్ విమర్శించారు.

 బీజేపీ ఏం చేసింది?

బీజేపీ ఏం చేసింది?

గుజరాత్ లో బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని హార్దిక్ పటేల్ విమర్శించారు. సూరత్‌లో రెండు ప్రభుత్వ ఆసుపత్రులు, ఒక ప్రభుత్వ పాఠశాల ఉందని హార్దిక్ పటేల్ గుర్తు చేశారు. ఇవి కాంగ్రెస్‌ హయాంలోనే నిర్మించారని హార్దిక్ పటేల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో సూరత్ లో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఎందుకు నిర్మించలేదని ఆ పార్ీ నాయకులను హార్దిక్ పటేల్ ప్రశ్నించారు.

 బీజేపీ ఇంటికే!

బీజేపీ ఇంటికే!

ఇదే డిసెంబర్ నెలలో గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఇంటికి వెలుతుందని, కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తోందని హార్దిక్ పటేల్ జోస్యం చెప్పారు. 22 ఏళ్ల బీజేపీ పాలనలో గుజరాత్ ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు అందరికీ న్యాయం జరుగుతుందని హార్దిక్ పటేల్ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hardik Patel says was offered Rs 5 crore not attending Surat rally in Gujarat.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి