వినేష్ ఫొగట్ రిజల్ట్ ఎలా ఉందంటే..: వెనుకంజలో డిప్యూటీ సీఎం
Haryana Assembly Election Results 2024: ఊహించినట్టే- హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టిస్తోంది. ప్రారంభ ఫలితాల్లో భారీ ఆధిక్యతను సాధించింది. ఓటింగ్ మొత్తం ఏకపక్షంగా సాగిందంటూ ఇదివరకే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తాజా ఫలితాలు నిజం చేసేలా కనిపిస్తోంది.
ఇటీవలే జమ్మూ కాశ్మీర్, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. కాశ్మీర్‌లో మూడు దశల్లో హర్యానాలో ఈ నెల 5వ తేదీన ఒకే విడతలో 90 చొప్పున నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది.

ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ- దూసుకెళ్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేేసే దిశగా అడుగులు వేస్తోంది. తొలి గంటలోనే భారీ మెజారిటీని సాధించింది. తొలి గంటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం 57 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
భారతీయ జనతా పార్టీ వెనుకంజలో ఉంది. ఏ మాత్రం కూడా పోటీ ఇవ్వలేకపోతోంది. తొలి గంటలో బీజేపీ 22 స్థానాల్లో ఆధిక్యతను సాధించింది. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్- 3, స్వతంత్ర అభ్యర్థులు ఎనిమిది చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత పెరుగుతూనే పోతోంది తప్ప ఎక్కడే గానీ తగ్గట్లేదు.
జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ భారీ ఆధిక్యతను సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన కేప్టెన్ యోగేష్ బైరాగిపై తిరుగులేని మెజారిటీతో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా లీడింగ్‌లో ఉన్నారు.

గర్హి సంప్లా కిలోయ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన మంజు హుడాపై ఆధిక్యతను సాధించారు. ఎల్లెనాబాద్‌లో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అభ్యర్థి అభయ్ సింగ్ చౌతాలా.. తన సమీప ప్రత్యర్థి భారత్ సింగ్ బేణివాల్‌పై ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
అలాగే- ఉఛనా కలాన్ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఉప ముఖ్యమంత్రి, జన్ నాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా వెనుకంజలో ఉన్నారు. ఆయనపై బ్రిజేంద్ర సింగ్ ఆధిక్యతను సాధించారు.












Click it and Unblock the Notifications