• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ నేతలకు ఏమైంది..? కాశ్మీరీ అమ్మాయిల వెంటపడ్డారు..! మొన్న ఎమ్మెల్యే.. నేడు ఏకంగా సీఎం!!

|

ఎన్నో ఉద్రిక్తతల నడుమ ఆర్టికల్‌ 370 రద్దు జరిగింది. దేశవ్యాప్తంగా జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకపక్క పరిస్థితులను మామూలు స్థితికి తీసుకురావడానికి కేంద్ర సర్కార్ నానా పాట్లు పడుతుంటే, బాధ్యతారహితంగా మాట్లాడిన ఓ సియం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త సమస్యలు సృష్టించేలా ఉన్నాయి.

పెట్టుబడులు సొంత డబ్బా కొట్టుకుంటే వస్తాయా జగన్ గారూ.. ఎద్దేవా చేసిన లోకేష్

కాశ్మీరీ అమ్మాయిలపై అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలు

కాశ్మీరీ అమ్మాయిలపై అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలు

జమ్మూ కాశ్మీర్ వ్యవహారం అత్యంత సున్నితమైన వ్యవహారం. ఇక ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరించాల్సిన వారు, జాగ్రత్తగా మాట్లాడవలసిన వారు నోరు జారి మాట్లాడితే దాని పరిణామాలు తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంది. అలాంటి చోట హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ అనాలోచితంగా మాట్లాడారు. కాశ్మీరి అమ్మాయిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బిజెపికి తలనొప్పిగా మారాయి.

ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకాశ్మీర్ పునర్ విభజన జరిగిన తర్వాత కశ్మీర్‌ లోయలో ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తున్నారు. ఇక బాధ్యత గల పదవిలో కొనసాగుతున్న వ్యక్తులు తమ స్థాయిని మరిచి అనాలోచిత వ్యాఖ్యలు చేస్తూ, అత్యుత్సాహం ప్రదర్శిస్తూ విమర్శల పాలవతున్నారు.

మొన్న యూపీ ఎమ్మెల్యే .. నేడు హర్యానా సీఎం .. అందమైన కాశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చని వ్యాఖ్యలు

మొన్న యూపీ ఎమ్మెల్యే .. నేడు హర్యానా సీఎం .. అందమైన కాశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చని వ్యాఖ్యలు

మొన్నటికి మొన్న యూపీ బిజెపి ఎమ్మెల్యే విక్రమ్ సైని ఇక అందమైన కాశ్మీరి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని ,దేశంలోని ముస్లిం యువకులు ఇక నుంచి అందంగా, తెల్లగా ఉన్న కశ్మీరీ అమ్మాయిలను ఎలాంటి భయం లేకుండా పెళ్లాడొచ్చనే ఆనందంలో ఉన్నారని ముజఫ్ఫర్‌నగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో రేపిన దుమారం మరువకముందే మరోమారు హర్యానా ముఖ్యమంత్రి కాశ్మీరి అమ్మాయిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై స్పందించిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ మహర్షి భగీరథ జయంత్యుత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

కశ్మీర్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చేందుకు లైన్‌ క్లియర్ అయిందని హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్య

కశ్మీర్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చేందుకు లైన్‌ క్లియర్ అయిందని హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్య

మా ప్రభుత్వంలోని కొందరు మంత్రులు బిహార్‌ నుంచి కోడళ్లను తెచ్చుకుంటామని చెప్పేవారని పేర్కొన్న ఆయన మంత్రి ఓపీ ధన్‌ఖర్ బీహార్ నుంచి కోడళ్లను తీసుకొస్తానని చేప్పేవారు. కానీ ఇప్పుడు కశ్మీర్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చేందుకు లైన్‌ క్లియర్ అయింది. అని సాక్షాత్తు సీఎం వ్యాఖ్యానించారు. అయితే ఖట్టర్ ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన విషయంలో హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా ఇకనుండి కాశ్మీరి అమ్మాయిలను కోడళ్ళుగా, భార్యలుగా చేసుకోవచ్చని అందరిచూపు కాశ్మీరి అమ్మాయిల వైపే ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో పెను దుమారం రేపి విమర్శలకు కారణమవుతున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Haryana Chief Minister Manohar Lal Khattar on Friday stoked a controversy while making a reference to Kashmiri women. Khattar said that after abrogation of the provisions of Article 370, girls from Kashmir can be brought for marriage.People nowadays have started saying the route to Kashmir has cleared and now we will bring girls from Kashmir,”he stated
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more