లక్కీ విక్రమ్.. రూ.49తో రాత్రికి రాత్రే రూ.3 కోట్ల జాక్ పాట్
రాత్రికి రాత్రే రాజయోగం పట్టడం అంటే ఇదేనేమో. కాలం కలిసి రావాలి కాని ఎంతసేపు చెప్పండి పేదవాడు.. కోటీశ్వరుడిగా మారడానికి. అదృష్టం అంటే ఇదే మరి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే .. ఓ సర్పంచ్ భర్త రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. రూ.49 పెట్టి 'మై11 సర్కిల్' యాప్ లో గేమ్ ఆడాడు. ఇప్పుడు అతడు ఏకంగా రూ.3 కోట్లు గెలుచుకున్నాడు. ఇది కదా లక్కు అంటే అని సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు.
ఏం జరిగింది..?
హరియాణా కర్నాల్‌లోని షేక్ పురా సుహానా గ్రామానికి చెందిన విక్రమ్ కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. రోజూ ఆన్ లైన్ యాప్స్ లో క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. ప్రస్తుతం విక్రమ్ ఓ సర్వీస్ సెంటర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇక విక్రమ్ భార్య ఆ ఊరి సర్పంచ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఏప్రిల్ 1న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో విక్రమ్ రూ.49 పెట్టి మై11 సర్కిల్ లో టీమ్ ఫామ్ చేసి ఫాంటసీ గేమ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో అతడు ఏకంగా ఫస్ట్ ప్లేస్ సాధించాడు. దీంతో అతడు రూ.3 కోట్లు, ఒక మహీంద్రా థార్ ఎస్ యూవీ గెలుచుకున్నాడు.

తాను చాలాసార్లు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడానని.. కొన్నిసార్లు బహుమతులు గెలుచుకున్నాను.. కానీ ఈ రేంజ్ జాక్ పాట్ ఎప్పుడూ రాలేదని తెలిపాడు. ఏకంగా రూ. 3 కోట్లు వచ్చిందని.. మిలియనీర్ అవుతానని కలలో కూడా అనుకోలేదన్నాడు. 2019 నుంచి తాను ఆన్ లైన్ గేమ్స్ ఆడుతున్నానని.. ఎప్పుడూ ఇంత సంపాదన చూడలేదని అన్నారు.
మరోవైపు తన భర్తకు క్రికెట్ అంటే ఇష్టమని ఆ ఊరి సర్పంచ్ రేఖ తెలిపారు. నిన్న రాత్రి ఈ వార్త తెలిసి షాక్ కు గురయ్యానని.. కోటీశ్వరులం అవుతామని ఎప్పుడూ ఊహించలేదన్నారు. అయితే నాలాగా ఆన్ లైన్ గేమ్స్ యువత ఆడొద్దని విక్రమ్ సందేశం ఇచ్చారు. ఇలా నూటికో కోటికో ఒక్కరికి జాక్ పాట్ తగులుతుందని.. ఆశతో యువత ఇందులో పడొద్దని అన్నారు.












Click it and Unblock the Notifications