ఎట్టకేలకు ఆచూకీ పసిగట్టిన పోలీసులు, ఢిల్లీ నివాసంపై దాడి.. హనీప్రీత్ పరుగో పరుగు!
డేరాబాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక, పంచకుల అల్లర్ల కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ సింగ్ కోసం పోలీసుల నుంచి తప్పించుకుంది.న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లోని ఎ-బ్లాక్ లో హనీప్రీత్ సింగ్ ఉన్నట్టు
Recommended Video

న్యూఢిల్లీ: డేరాబాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక, పంచకుల అల్లర్ల కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ సింగ్ కోసం పోలీసుల నుంచి తప్పించుకుంది. హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ ఢిల్లీలో ఉన్నట్లు, హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో ఆమెకోసం పోలీసులు ముమ్మర గాలింపు జరుపుతున్నారు.
హనీప్రీత్ కు ముందస్తు బెయిల్ మంజూరుకాక ముందే... ఆమెకు అరెస్టు వారెంటు జారీ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లోని ఎ-బ్లాక్ లో హనీప్రీత్ సింగ్ ఉన్నట్టు తెలియడంతో హర్యానా పోలీసులు మంగళవారం ఆ ప్రాంతమంతా మెరుపు సోదాలు నిర్వహించారు.

అయితే అప్పటికే జాగ్రత్త పడిన హనీప్రీత్ సింగ్ అక్కడి నుంచి కూడా ఉడాయించినట్టు తెలుస్తోంది. అనంతరం ఢిల్లీలోని చిత్తరంజన్ పార్కు ప్రాంతంలో కూడా పోలీసులు హనీప్రీత్ కోసం గాలించారు. అక్కడ కూడా ఆమె జాడ కనిపించలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ముందస్తు బెయిల్ కోసం హనీప్రీత్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఆమె లాయర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బెయిల్ పిటిషన్ దరఖాస్తుపై సంతకం పెట్టేందుకు సోమవారం హనీప్రీత్ తన కార్యాలయానికి వచ్చి వెళ్లినట్టు కూడా ఆయన పేర్కొన్నారు. మంగళవారం హనీప్రీత్ బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హనీప్రీత్ ఆచూకీ పసిగట్టేందుకు మొత్తం ఐదు బృందాలను పోలీసులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో హనీప్రీత్ సింగ్ ఉన్నట్టు తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే హనీప్రీత్ అక్కడ్నించి జంప్ అయింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications